Others

ఉదయస్తే ఏమవుతుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికీ మనిషికీ మధ్య దూరం ఒక్క మాటేనా
బాటలన్నీ సంఘర్షణలతో ఏర్పరచుకున్న వాళ్లం..
ఒక్క పలకరింపైనా ఆపలేకపోతోందా..?
ఆరడుగుల ఎత్తున్న హృదయాల్ని కదిలించలేకపోతోందా..?
అనిపిస్తుంది అప్పుడప్పుడు..

ఏ శరీరానికి ఏ పాత్రను ఎవరిచ్చారో?
ఈ నటనా రస పోషణకు తర్ఫీదు ఎవరు చేసారో?
ఎవరికేం తెలుస్తుంది?
జీవితమంతా నడిచామో, పరుగులు తీసామో,
చివరికి మాత్రం ఆయాసపడుతూ చతికిలపడ్డాం!

ఉన్నట్లుండి
ఏ మాత్రం నిలువలేని శాస్త్రాలు
ఎవరికీ పట్టుపడకుండా..
నాకు జన్మనిచ్చే హక్కు ఎవరిచ్చారని నిలదీస్తుంటే
ఎలా జవాబివ్వాలి..?

ఆటబొమ్మల్లా తలాడిస్తూ ఉండే
భారీ అంతస్తుల మీద మచ్చల్లాంటి బిడ్డలందరూ
కూడా మనిషి నుండే ఉద్భవించారు కానీ
మరుమల్లెల మాటలతో కనిపించే రూపాల్లా
ఎప్పటికి తయారవుతారు?
అసలు ప్రాణం అంటే ఏమిటో
ఎవరు విపులీకరిస్తారు..?

గ్రహాలన్నీ ఇపుడు మన చేతిలోని వస్తువులే కాదనను
అలాగని మనం ఆకాశంలో నడవలేము
ప్రపంచ సౌందర్యమంతా కుంచెకు దాసోహమే కాదనను
అంతమాత్రాన ఒక హృదయాన్ని ఆవిష్కరించలేము
పుష్పాలను పిండి రక్తాన్ని చూపించలేము.
మనిషి ఏదో ఒకనాటికి
పరుగెత్తీ పరుగెత్తీ అలసిపోయి, సొలసిపోయి
ఎక్కడ్నించి బయలుదేరాడో మరచిపోతాడు...

ఎప్పటికైనా
అందరికంటే వెనుకగా నిలబడినవారే
ఊరేగింపుకైనా,
ఉద్యమాలకైనా నాయకత్వం వహిస్తారు...
గుండెలపైన ఏ ఆచ్ఛాదన లేనివాడే
ప్రపంచాన్ని మరింత స్పష్టంగా చూడగలడు...
ఎందుకంటే...
గుండెకు, ప్రపంచానికీ మధ్య
అడ్డుపడేది చొక్కా జేబులోని రూపాయి నోట్లే..!!

-శైలజామిత్ర.. 9290900879