Others

ఫ్రిజ్ శుభ్రం ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరి ఇళ్లు చాలా శుభ్రంగా కనపడుతుంటాయి. సోఫాలు, మంచాలు,కిటికీలు, అందమైన అలమర్లు ఇలా కనిపించేవన్నీ చాలా నీట్ గా ఉన్నట్టు కనిపిస్తాయి. కాని వారి ఫ్రిజ్ డోర్ తెరిస్తే మాత్రం అందులో ఉండేవన్నీ ఒక్కసారిగా మీద పడిపోతుంటాయి. మరికొందరి ఫ్రిజ్‌ల్లో లెక్కలేనన్ని పండ్లు, కూరలు, వివిధ ప్యాకెట్లు, సీసాలు, డబ్బాలు, పెరుగు, పాలు అన్నీ ఒక పెద్ద షాపును తలపిస్తాయి. కాని ఫ్రిజ్ నిండా చెత్త, ఒకలాంటి దుర్వాసన కూడా వస్తుంటుంది. అట్లాకాకుండా ఫ్రిజ్‌ను ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంచుకోవాలి.లేనట్లు అయితే అందులో పెట్టిన ఆహారపదార్థాలు చెడిపోవచ్చు. ఫ్రిజ్ కరెంటు కూడా ఎక్కువ అవచ్చు. అట్లాకాకుండా ఉండాలంటే కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు అవసరమైనవి మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌ను వారం రోజులకొకమారైనా తప్పనిసరిగా తుడవాలి. కూరలు,పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదు. వాటిని నిల్వ చేసిన కవర్లు పాడవకముందే తీసేయాలి. డ్రైప్రూట్స్ ను కూడా ఫ్రిజ్‌లో నిల్వచేస్తుంటారు కొద్దిమంది. ఇది మంచిదికాదు. ఉప్మారవ, మైదా, శనగపిండ్లు లాంటివి కూడా ఫ్రిజ్‌లో పెట్టడం చేయకూడదు. సగం వాడేసిన పదార్థాలను మూతలు పెట్టకుండా కూడా పెట్టడం మంచిదికాదు. బేకింగ్‌సోడాను నీళ్లలో కలపి పైనుంచి కిందకు తుడిస్తే ఫ్రిజ్ మన్నిక పెరుగుతుంది. డోర్ పట్టనంతగా వస్తువులు పెట్టడం మంచిదికాదు.