Others

రె రె రెజీనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని విషయాలను సీరియస్‌గా పట్టించుకోవాలి. కొన్ని విషయాలను పట్టించుకోనట్టు వదిలేయాలి. పట్టువిడుపులుంటేనే పరిశ్రమలో మనగలుగుతాం. ఈ చిలక పలుకులు ఎవరివో కాదు, తెరపై ‘నక్షత్రం’లా మెరిసిపోతానని మురిసిపోతున్న రెజీనా కాసాండ్రవి. పట్టుమని పది సినిమాలు చేసినా ఖాతాలో ఒక్క హిట్టూ పడకపోవడంతో -రెజీనా ఇంకా కొత్త కథానాయికల రేంజ్‌లోనే ఉంది. పైగా తామర తంపరగా వస్తున్న కొత్త హీరోయిన్ల గ్లామర్ పోటీని తట్టుకుంటూ.. కుర్ర హీరోలతో చాన్స్‌లు రాబట్టడానికి ఇబ్బందులు పడుతోందట. వాళ్ల పోటీ తట్టుకోవాలంటే రెచ్చిపోక తప్పదని నిర్ణయించుకున్న రెజీనా -కృష్ణవంశీ సినిమా నుంచి అందాల ఆరబోతకు సిద్ధమైందన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తే -హీరోయిన్ల అందాలే ప్రేక్షకుడికి రిలీఫ్. పాత్రను బట్టి కాస్త గ్లామరస్‌గా కనిపించాల్సి వచ్చినపుడు ‘నో’ చెప్పడం అంటే కెరియర్‌ని వెనక్కి నెట్టుకోడవమే. అయినా గ్లామరస్‌గా కనిపించడాన్ని ఎక్స్‌పోజింగ్ అనుకుంటే ఎలా? కథానాయిక పాత్రను బట్టి ఎలా చూపించాలో దర్శకుడు కృష్ణవంశీకి తెలియంది కాదు’ అంటోందట. అంటే -అవునూ కాదూ అనకుండానే అందాల ఆరబోత మోతుదు ఏస్థాయిలో ఉండబోతోందో చెప్పకనే చెబుతోందన్న మాట.