Others

సందర్భానుసారంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీలకు, ఆఫీసులకు, కాలేజీలకు, విహారాలకు ఒకేరకమైన బ్యాగులను వాడటానికి ఇప్పుడూ ఎవ్వరూ ఇష్టపడటం లేదు. సందర్భానుసారంగా హ్యాండ్ బ్యాగును ఎంచుకుంటేనే అసలైన ఫ్యాషన్. కాలేజీకెళ్ళే అమ్మాయిలకు బ్యాక్‌ప్యాక్‌ను మించినది మరోటి ఉండదు. ఇది చాలా అందంగానూ, సౌకర్యంగానూ ఉంటుంది. ఇది ప్రయాణాలకు వెళ్లేవారికి, ముఖ్యంగా టూ వీలర్‌పై వెళ్లేవారికి, ఆఫీసులకు వెళ్ళేవారికి ఈ బ్యాక్‌ప్యాక్ అనువైనది. చేతిలో పట్టుకునేందుకు అనువుగా ఉండేది క్లచ్ హ్యాండ్‌బ్యాగ్. ఇది ఎక్కువగా పార్టీలకు నప్పుతుంది. ఎన్నో రంగులూ, మరెన్నో హంగులతో ఇలాంటివి రకరకాల డిజైన్లలో ఉన్న వీటిని పార్టీలకు వేసుకునే దుస్తులకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. షోల్డర్ బ్యాగులను యుటిలిటీ బ్యాగులని కూడా అంటారు. వీటిలో సాధారణ వస్తువులతో పాటు ఫోన్లు, ట్యాబ్‌ల వంటివాటిని కూడా పెట్టుకోవచ్చు. చిన్న సైజు లాప్‌టాప్‌లను పెట్టుకునేందుకు వీలుగా ఇప్పుడు షోల్డర్ బ్యాగులను తయారుచేస్తున్నారు. క్రాస్‌బాడీ బ్యాగ్స్ నేటి ఫ్యాషన్. పేరుకు తగ్గట్టుగానే దీన్ని భుజాల మీదుగా వేసుకుంటాం. దీని పట్టీలు లెదర్, చైన్ లింక్స్‌తో ఉంటాయి. మన అవసరానికి తగ్గట్టుగా చిన్న, మధ్యస్థ, పెద్ద పరిమాణాల్లో లభిస్తాయి ఈ హ్యాండ్ బ్యాగులు. ఇవి కూడా కాలేజీ అమ్మాయిలకు బాగా ఉపయోగపడతాయి. ఆఫీసుకు వెళ్ళేవారికి కూడా ఇవి సౌకర్యంగా ఉంటాయి. టోటె హ్యాండ్ బ్యాక్ చూడటానికి పెద్దగా కనిపిస్తుంది. ఎక్కువ వస్తువులను తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ బ్యాగు చాలా సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా విహారాలకు వెళుతున్నప్పుడు ఇది చాలా చక్కని ఎంపిక. అవసరానుగుణంగా ట్యాబ్‌లు, లాప్‌టాప్‌లకు కూడా ఇది ఉపయోగపడుతుంది. పగలైనా, రాత్రైనా స్టైలిష్‌గా కనిపించేందుకు హోటో హ్యాండ్‌బ్యాగ్‌ను మించినది మరొకటి లేదు. ఇది అందంగా, స్టైల్‌గా కనిపించడంతో పాటు, ఇందులో వస్తువులు కూడా ఎక్కువగానే పడతాయి. చూశారుగా! ఇక మీకు నచ్చిన హ్యాండ్‌బ్యాగులను కొని సందర్భానుసారంగా వాడేసుకోండి మరి! *