Others

సమధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనాల సమధర్మం
ఆనందబాష్పాలకీ
కన్నీటికి ఒకటే రుచి!

విషాదాలు కొన్నైనా
అనుభవించాలి
వినోదాల రుచి
తెలుసుకోవాలిగా!!

వర్షానిది జాలిగుండె!
అతని కంటనీరు ఎవరికంటా
పడకుంటా హఠాత్తుగా కురిసీ!!

ఇచ్చి పుచ్చుకోవడాలు
నీ తర్వాతే! చిరునవ్విచ్చావ్ ..
హృదయాన్ని తీసుకుపోయావ్!!

జ్ఞాపకం - మరుపు బద్ధ శత్రువులు
ఒకదాన్నొకటి ఎప్పటికీ కలుసుకోవు!!

భోగాలు , సుఖం - యోగాలు- ఆనందం
ఈ వ్యత్యాసం తెలుసుకోవడమే
జీవిత పరమార్థం!!

మాట మందుపాతరై - నవ్వు శతఘ్నిలా
దేశాన్ని వశం చేసుకున్నట్టు
నా దేహాన్ని ఆక్రమించుకుంటూ!!
నిన్ను భువికి పంపడం బ్రహ్మతెలివి!
తన అద్భుత సృజనను
సృష్టికి తెలియజేయాలని!!

గుండెల్లో ఘనీభవించిన బాధ!
నీ సేదతో ద్రవీభవించి .. కన్నీరుగా!!
ఫలానా కాలమని ఉండదు కదా!
నీ జ్ఞాపకాల గుబాళింపులకి!!

--తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి