Others

నిత్యస్ఫూర్తి అబ్దుల్ కలాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తొలి శాస్తవ్రేత్త ఎవర’ని ఓ పిల్లగాడు తనతో ముచ్చటిస్తున్న పెద్దాయనను అడిగాడు. ‘ఎవరో కాదు- చిన్నారి’ అని ఆయన జవాబిచ్చాడు. దాంతో బుల్లి మెదడుకు బోధపడలేదు. ‘ప్రశ్నలు ఎవరికి వస్తాయి? పిల్లలకే కదా! మరి పిల్లవాడే శాస్తవ్రేత్త’ అని జవాబు పొందిన బుడుగు మహదానందపడిపోయాడు. చిన్నారి ప్రశ్న ను అర్థవంతంగా విశే్లషించి విజయహారం మెడలో వేసిన దార్శనికుడు ఏపీజే అబ్దుల్ కలాం.
సరిగ్గా మూడేళ్ల క్రితం- షిల్లాంగ్ (మేఘాలయ)లో 2015 జూలై 27న ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ (ఐఐఎం) విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆ ‘83 ఏళ్ల యువకుడు’ కన్నుమూశారు. కలాం శాస్తవ్రేత్తగా, క్షిపణి యోధుడి (మిస్సైల్ మ్యాన్)గా, రాష్టప్రతిగా- పీపల్స్ ప్రెసిడెంట్‌గా ఎంతో మన్నన పొందారు. కలలు కనమనీ, వాటిని సాకారం చేసుకోమనీ పెద్ద ఎత్తున బాలబాలికను, యువతీ యువకులను ప్రేరేపించి, వారికి దారి చూపిన దార్శనికుడిగా కలాం కలకాలం గుర్తుంటారు. ఆయన వీణ వాయించగల రసజ్ఞుడు. సాహిత్యం ఆస్వాదించగల భావుకుడు. గీతా మర్మం అందుకోగల సృజన శీలి. ఆయనలో ఒక సూఫీ వేదాంతి, ఒక గాంధీ, ఒక ఐన్‌స్టీన్ కలగలసి ఉంటారు.
ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న రామేశ్వరం (తిమిళనాడు)లో పేద దంపతులైన జైనుబుద్దీన్,ఆషియమ్మలకు జన్మించారు. చింతపిక్కలేరుకుని రోజూ అణా గడించిన అనుభవం, రామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి వార్తాపత్రికలు తెచ్చి వీధుల్లో అమ్మిన నేపథ్యం, ఆర్థికభారంతో మాంసాహారాన్ని త్యజించిన పరిస్థితి, చదువు కోసం అక్క గాజులను కుదువ పెట్టిన కష్టం- ఇలా చాలా ‘సామాన్యుల కష్టాల’ ఫలితం అబ్దుల్ కలాం. అయితే ఆయనలోని ఆశావాదం కడదాకా నిటారుగా, సగౌరవంగా నిలిచింది. ఏమిటా ఆశావాదం? రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రామేశ్వరం సముద్ర తీరంలో ఎగిరే యుద్ధ విమానాలను గమనించి, ఎప్పటికైనా విమానాలు ఎగురవేసే విద్యలో ప్రావీణ్యం గడించాలని ఆయన కలలు కన్నారు. ప్రతి విషయంలోనూ ఆశావహ కోణాన్ని అందిపుచ్చుకోవడం ఆయన గొప్పదనం. అందువల్లనే తన విజయానికి- తల్లి నుంచి నమ్మకం, దయ, తండ్రి నుంచి నిజాయితీ, క్రమశిక్షణ, మిత్రుడైన బావ నుంచి సృజన, తండ్రి స్నేహితుడు లక్ష్మణ శాస్ర్తీ నుంచి పరమత సహనం వంటివి కారణాలని కలాం భావిస్తారు.
1958లో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగం, పరిశోధన ప్రారంభించిన ఆయన దేశరక్షణకు అవసరమైన సాంకేతిక విజ్ఞానం అందించిన శాస్తవ్రేత్తగా ఎదిగారు. ఉపగ్రహ వాహక నౌకల నిర్మాణం, క్షిపణుల తయారీ, పోక్రాన్ అణుపరీక్షలు.. ఇలా పలురకాల సాంకేతిక విజ్ఞాన కృషిలో కలాం నాయకత్వం మిన్నగా కనబడుతుంది. పీహెచ్‌డీ, ప్రచురణలు, విదేశీ పర్యటనలు వంటివి ఆయనకు ముఖ్యం కాదు. సామాజిక ప్రయోజనం ఆయన కృషికి గీటురాయి. అందువల్లనే అంగవైకల్యం ఉన్నవారు వాడే ‘కాలిపర్స్’ బరువు మూడు కిలోల నుంచి 300 గ్రాములకు- పదోవంతుకు తగ్గించ గలిగారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి పలు గౌరవాలు అతని కోసం నడచి వచ్చాయి. రక్షణ మంత్రి సలహాదారుగా, ప్రధాని సలహాదారుగా బాధ్యతలను గొప్పగా నిర్వహించారు. 2002లో అన్ని రాజకీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రాష్టప్రతి పదవికి ఎన్నికైన విలక్షణ వ్యక్తి కలాం. రాష్టప్రతి కాకముందు, ఆ తర్వాత కూడా పిల్లలతో, యువతతో కాలం వెచ్చించాలని తాపత్రయపడ్డారు. 2017 జూలై 27న మన నుంచి శాశ్వతంగా దూరమైనప్పటికీ- అబ్దుల్ కలాం అందరికీ నిత్యస్ఫూర్తి.
*
(నేడు కలాం తృతీయ వర్ధంతి)

-డా. నాగసూరి వేణుగోపాల్ 94407 32392