Others

పల్లె ఇత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లొదిలీ పట్నం బోయిండురో బిడ్డ,
పట్నానికి బోయిండురో,
నా కొడుకు పట్నానికి పోయిండురో..
సదువుకుంట ననీ బోయిండు,
పెద్ద సదువులే సదివిండు,
ఆ పాలే, గాడనే వుండిపోయిండు,
కొలువు సేసుకుంట,
గాడనే వుండీ పోయిండు,
ముందు ముందు గాల వారానికొక్క
పారి వస్తుండే,
మెలిమెల్లిగ నెలకో పారి ఆయ్యే
గింతల ప్రేమ అంట దాన్ల పడ్డడు,
పట్నం పిల్లతో, పెండ్లి అయింది,
ఇహ మూడు నెలలు, ఆరు నెలలకో
పారి కాబట్టె,
అయిన గాని, నిజం చెప్పాలె,
డబ్బులు మాత్రం బాగనే ఇస్తుండె,
వూర్ల ముసలోల్లకి డబ్బెందుకే
మనుషులు కావాలేగాని,
గందుకే గవర్నమెంటోడి
బడి దిక్కు ధ్యాస బెట్టిన, ఇక ముందు
కొందరయిన గీడనే సదువుకుంటే,
ఈడనే వుండే అలవాటు చేసుకుంటరేమోనన్ని
గాడ, పట్నంలో
మొగుడు పెళ్లాలు కొలువులు జేసుకుంట,
వున్న ఒక్క పిల్లగాన్ని,
లాడు బాగనే జేసిండ్రు గానీ,
టైమ్ యేడ వుండె,
వాన్ని మంచిగ బెంచనీకి;
పోరడు సెడిపో బట్టే,
అమ్మ నాన్న ఏడుపు మొఖం బెట్టిరి,
ఇహ నోరు తెరవక తప్పలే;
పోరగాన్ని నాతో తెచ్చుకుని బడిల ఏసిన,
మూడు నెలలు వానితో
నేను కూడా పోయొచ్చిన,
సంవత్సరాలు గడిసినాయి,
నా పేరు నిలబెట్ట నా మనవడు,
మొత్తం జిల్లాలోనే మొదటగా నిలిచిండు,
పదో కిలాసుల
ఇప్పుడు వాన్ని అడవిల ఒదిల్నా,
అమెరికాలో వొదిలినా,
యేమి ధోకాలేదు,
పల్లెలో పడ్డ పునాది పట్నాలలో
ఎన్నడు బడాలే,
తెలుసుకో నాయన,

--నండూరి రామచంద్రరావు 9949188444