Others

సులువుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజంతా ఇంట్లో పనితోను, ఆఫీసు పనితోను అలసి పోతున్నారా... అసలు మీకంటూ సమయం చిక్కడంలేదా... మీ బాడీ ని ఫిట్‌గా ఉంచుకోవడానికి కాస్తంత ఎక్సైసైజులు చేద్దాం అంటే అసలు టైము దొరకడం లేదా.. దిగులు పడకండి.. ఇవిగో మీలాంటి వారికోసం చిన్న చిన్న చిట్కాలు రెడీ...
మీరు రోజులో ఏదో ఒక టైములో కనీసం రిలాక్స్ కోసమైనా టీవీ ముందు కూర్చుంటారు కదా. అదిగో అపుడే మొదలెట్టండి మీ ఎక్సైసైజులు కాళ్లు బారా జాపండి. తిరిగి ముడుచుకోండి. ఇలా కొద్ది సేపు చేయండి. కుర్చీలో కూర్చుని కాళ్లరెండింటినీ కాసేపు ఆగకుండా కదుపుతూ ఉండండి. పాదాలను సైకిల్ చక్రం లాగా తిప్పండి. తిరిగి వెనక్కు తిప్పండి. అట్లానే చేతులను కూడా వీలైనంత చాపండి. తిరిగి ముడుచుకోండి.పైకి కిందకి, పక్కకి వీలైనంతగా చాపండి తిరిగి వెనక్కు తీసుకోండి.. అప్పుడప్పుడు కాసేపు నిలబడి వెంటనే కింద అంటే నేల మీద కూర్చోండి. నిలవండి. ఇంకా ఓపిక ఉంటే చక్కగా తాడాట ఆడండి. కాసేపు బ్రిస్క్ వాక్‌లాగా చేయండి. ఇవన్నీ ఎంతో సేపు అక్కర్లేదు. అరగంట చేసినా చాలు మీకు శ్రమ అనిపించకుండా వ్యాయామం చేయడం అయిపోతుంది. ఎంత పని ఉన్నా సరే ఓ అరగంట సేపు నడవండి. ఇంట్లోనైనా, పెరటిలోనైనా, లేదా టెర్రస్ మీద నైనా కారిడార్‌లోనైనా కాసేపు ఒకేసారి వీలు కాకపోతే పొద్దున రాత్రి అంటే పడుకోబోయే ముందు కూడా కాసేపు నడవడం అలవాటు చేసుకోండి. మీకు మంచి నిద్రతో పాటు శారీరానికి చక్కటి వ్యాయామం లభిస్తుంది. మీ ముఖంలో మంచి తేజస్సుతో వెలుగుతుంది.

--లక్ష్మీప్రియాంక