Others

సమయ పాలన పాటిస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది మాకు చాలా చాలా పనులు చేయాలని ఉంది కానీ టైమ్ అసలు లేదు అంటుంటారు. కోటి రూపాయలు సంపాదించేవారికి, అర్థరూపాయి సంపాదించేవాడికి రోజుకు 24 గంటలే ఉంటాయి. దీనికి మించి ఎవరికి ఏ సమయం ఉండదు. ఎందుకు కొందరు టైము ఉందని, కొందరు లేదని అంటారు అంటేవారికి ఏ టైములో ఏది చేయాలో తెలియకపోవడమే. నిద్ర లేచింది మొదలుకొని అలసటగా, అలసత్వంతో ఉంటే ఏ పనీ చేయలేరు. అనుకొన్న పనులు అసలే పూర్తిచేయలేరు. అట్లాకాక ముందురోజే తర్వాతి రోజుకు ఏ పనులు ఉన్నాయో చూసుకోవాలి. వాటిని ఒక క్రమంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో కూడాఆలోచించుకోవాలి. ఉదాహరణకు రాత్రి భోజనానికి ఏమి కావాలో అని పొద్దునే్న చేస్తూ కూర్చున్నారు అనుకోండి. ఏవౌతుంది. ఉన్న టైము అయిపోతుంది. తిండి రాత్రికి మాత్రం ఉంటుంది. ఇప్పుడు తినడానికి ఏమీ ఉండదు. అట్లాకాక ఏ పని ముందు చేయాలి ఏది తర్వాత అనేది ముందు ఆలోచించండి.
ప్రతిరోజు ఎవరైనా సరే చేయాల్సిన పనిని ఎంత టైము లో పూర్తి అవుతుందో చూసుకోవాలి. ఆ టైము ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో చూడాలి. ఆతరువాత పని మొదలెట్టాలి. మధ్యలో ఆపేసి ఇంకో పనికి వెళ్లగూడదు. ఏపని యైనా పూర్తి చేసాక మరోపనిని చేయాలి.
పనులు చేయడంలో క్రమపద్ధతి పాటించాలి. ఉదా.1,2,3,4 అనే పనులున్నాయి అనుకోండి ఒకదాని తర్వాత మరోటి చేస్తూ పోతే మిమ్ములను మోనోక్రానిక్‌గా పనిచేస్తున్నారు అంటారు. అట్లాకాక ఉన్న నాలుగు పనులను అవసరాన్ని బట్టి పనులు ముందు వెనుక చేస్తారు. ఒకేసారి రెండు పనులు కూడా చేస్తుంటారు.వీళ్లని పాలీక్రానిక్ అంటారు.
కానీ వీళ్లు చేసే పనిని కలగాపులగం అయ్యేట్టు చేసేసుకుంటారు. దానివల్ల పనిలో ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సి వస్తుంది. ఒక పని అతిత్వరగా ముగించాల్సి ఉంటుంది. మరో పని నిదానంగా చేయాల్సి ఉంటుంది. అందుకే ఏపని యైనా ఒక్కోక్కటి చేయడమే ఉత్తమం. ఒక్కోసారి ఇలా చేయాల్సి వస్తుంది. అపుడు కంగారు లేకుండా పనిని సాగించాలి. కావాల్సి వస్తే తొందర లేని పనులను మెల్లగా చేయాలి. అనుకొన్న దానికన్నా రెండు గంటలు ఎక్కువ పని చేసినా ఎవరూ ఏమీ అనరు. పనిని నాణ్యంగా చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. అనుకొన్న పని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసుకోవాలి. అంతేకాని అవసరం ఉన్నా లేకున్నా ఎవరితోనో గంటల తరబడి మాట్లాడడం లేదా టీవీ చూస్తు కాలాన్ని గడిపేసి ఇపుడు చేయాల్సిన పనికి టైము లేదనుకోవడం వేస్టు. అట్లానే పొద్దునే్న లేవడం వల్ల కూడా పనులను తొందరగా అంటే అనుకొన్న సమయంలోనే పూర్తి చేసుకోవచ్చు. పైగా కాసేపు నడక, లేదా ఇష్టమైన వ్యాయామాన్ని అరగంట చేసినా పనులు చేయడానికి శరీరం పూర్తిగా సహకరిస్తుంది. అపుడు ఉత్సాహంగా పనులుపూర్తి చేయవచ్చు. విశ్రాంతి తీసుకొన్నా కూడా పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. తప్పకుండా కాస్తంత రిలాక్స్ కూడా కావాలి. అపుడే పని తొందరగాను, నైపుణ్యంతోను చేయగలరు.

- శ్రీలత