Others

లేత మనసులు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ సంబంధాల మనోహర దృశ్యకావ్యం లేతమనసులు. మనోహార దృశ్యకావ్యం అని ఎందుకు అన్నానంటే భార్యాభర్తలు, పిల్లలు, అత్తామామలు- వీరిమధ్య అనుబంధం అజరామరంగా ఉండాలి. అరమరికలు లేకుండా ఉండాలి. అలాంటి కథను ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వాళ్లు ఎన్నుకుని డి.వి.నరసరాజుగారి చేత మాటలు రాయించుకుని, ఎం.ఎస్.విశ్వనాథన్ చేత సంగీతం సారథ్యంలో అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రం ‘లేత మనసులు’. హరనాథ్, జమున, జి.వరలక్ష్మి, రేలంగి, పద్మిని (డబుల్ యాక్షన్) పద్మనాభం, గీతాంజలి వంటి అసమాన నటులు అపురూపమైన నటనను ప్రదర్శించిన చిత్రమిది. అత్తగారి అహంకారానికి అల్లుడి ఆత్మాభిమానానికి మధ్య ఓ ఇల్లాలు పడిన మానసిక క్షోభ ఇంతమంది పెద్దల మధ్య పిల్లలు (కవలలు) నలిగిన కథ. హృదయానికి హత్తుకునే సన్నివేశాలు. వీనుల విందైన పాటలు ముఖ్యంగా ‘అందాల ఓ చిలుకా! అందుకో నా లేఖ’ ఆల్‌టైమ్ రికార్డ్. ఇప్పటికీ ఈ పాట వింటుంటే నిత్యనూతనంగా వుంటుంది. ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’, ‘కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో’, ‘అందాల చెలికాడా’ (ట్రాజెడీ సాంగ్), ‘మేడం సత్యభామ’ (టీజింగ్ సాంగ్), ‘మక్కువ తీర్చరా మువ్వాగోపాలా’ (వాస్తవంగా ఈ పాట నేటి మాటల్లో చెప్పాలంటే ఐటెం సాంగ్. కానీ గీతాంజలి చీరకట్టులో సాంప్రదాయ నృత్యరీతిలో ఎంత అందంగా హుందాగా నర్తించిందో వంటి సంగీత ప్రధానమైన పాటలు. అన్నీ చక్కగా అమరిన షడ్రసోపేతమైన విందు భోజనంలాంటి సినిమా. ఎన్నిసార్లు చూశానో.. తనివి తీరనంత ఇష్టం ఈ సినిమా అంటే.

-కొమ్మన వెంకటరమణారావు, నెల్లూరు