Others

‘‘మనసా కవ్వించకే నన్నిలా..!’’(నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మాలయ వారు 1972లో నిర్మించి విడుదల చేసిన మహోన్నత కుటుంబ కథా చిత్రం ‘పండంటి కాపురం’! అమోఘ విజయాన్ని సాధించిన ఈ చిత్రంలో అతిరథ మహారథులందరూ నటించారు. ముఖ్యంగా జమున పోషించిన మాలినీదేవి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆమెపై చిత్రీకరించిన పాట ‘మనసా కవ్వించకే నన్నిలా!’ ప్రాణాధికంగా ప్రేమించినవాడు తనను సర్వనాశనంచేసి మోసగించాడన్న అపార్థపు నేపథ్యంలో చిత్రీకరించబడిన పాట! ‘ఎదురీద లేక కుమిలేను నేను- సుడిగాలిలో చిక్కినా నావను’ అనే ఆక్రోశం ఉంది. ‘ఆనాడు వెనె్నలనేనై కరిగాను కౌగిలిలోన... ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా... నేనోడిపోయి, గెలుపొందినాను.. గెలిచానని నవ్వనా? ఏడ్వనా’ అని తనకు తానే ప్రశ్నించుకునే కనికరపు స్థాయి ఈ పదాలలో ఉంది. ముందు మోసగింపబడి ఓడిపోయాను.. తరువాత తన కక్ష తీర్చుకుని గెలుపు సాధించాను. ఓడానా? గెలిచానా? అని తనకుతానే అర్థంకాని పరిస్థితికి అద్దంపట్టాయి ఈ పదాలు! కెరటాన్ని తనతోనూ, నింగిని తన ప్రేమికునికి అన్వయించుకుని ఈ రెంటినీ స్నేహమా? అని తనకుతానే సందేహపడుతుంది. మోముపై ఉన్న ముంగురులు పసివాడి మల్లియలాయె- గుండెలోన కోరికలన్నీ కన్నీటి చారికలాయె- నా జీవితం శాపమా? పాపమా? అని తనకుతానే నిందించుకునే నిర్దిష్టపు భావానికి ప్రతిబింబంలా ఉన్నాయి ఈ పదాలు! అమోఘమైన పాట ఇది. విశేషమేమిటంటే తనను వంచించి మోసగించాడన్న అపోహతో పచ్చని అతని కుటుంబాన్ని ముక్కలుచేసి బాధ మిళితమైన ఒక శాడిజపు సంతోషంతో ఆమె పాడుకున్న పాట ఇది! ఈ పాటలో కసి, కోపం, ప్రతీకారం లాంటి లక్షణాలతోపాటు, కాసింత బాధ, కూసింత పశ్చాత్థాపం కూడా ఇమిడి ఉన్నాయి. ఒక పాటలో ఇన్ని విరుద్ధ భావాలకు సంబంధించి గీత ప్రతిష్ఠచేయడం రచయితకు కత్తిమీద సామే! యువ గీత రచయిత ‘గోపి’ వ్రాసిన ఈ గీతం అతనికి విపరీతమైన ఫేమ్ సంపాదించి పెట్టింది. (చాలా చిన్న వయసులో గోపి మరణించడం చాలా విచారకరం). ఇక స్వరకర్త ఎస్.పి.కోదండపాణికి ఎన్.టి.ఆర్. ‘దేవత’, ‘ఏ.ఎన్.ఆర్’, ‘మంచి కుటుంబం’ చిత్రాల తర్వాత మరో బ్లాక్‌బస్టర్ ఈ చిత్రం. ముఖ్యంగా ‘మనసాకవ్వించకే’. ఎంత కీర్తిని సమున్నతంగా సముపార్జించి పెట్టిందో అఖిలాంధ్ర సినీ ప్రేక్షకులకు తెలియచేసింది. ఇక జమున గురించి చెప్పేదేముంది? ఆ ఠీవి, దర్పం, పొగరు, ఆవేశం, బాధ, పశ్చాత్థాపం గెలిచానన్న ఆనందం ఎన్నో డైమన్షన్స్‌లో ఆమె హావభావాలు అద్భుతం! రాణీమాలినీదేవి అంటే ‘సత్యభామ’లాగా జమునే జమున అన్నంత అద్భుతంగా నటించింది. ఇన్నివిధాలుగా సాహిత్యంతో, సంగీతం, నటన పోటీపడిన గీతం ఇది. ఏ స్వర సంద్రంలో పుష్కర స్నానమాచరించి, ఏ నారద తుంబురుల ఆశీర్వాదం అందుకుని ఈ పాట పాడిందో గాని సుశీల తన గాత్రంతో, పలు భావాలను అలవోకగా పలికించిన శృతిలయల సరస్వతి అనిపించుకుంది. అందుకే ఈ పాటంటే నాకు ఎంతో ఎంతో ఇష్టం!!

-తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం