Others

సీరియస్ పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌కి దూరంగా కేవలం సౌత్‌లోనే సినిమాలు చేస్తున్నాడు ప్రభుదేవా. హిందీలో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న ఆయనకు అక్కడ బ్రేక్ పడింది. దాంతో కాస్త గ్యాప్ ఇవ్వాలని సౌత్‌పై ఫోకస్ పెట్టాడు. ఇక తమిళంలో ప్రభుదేవా సినిమాలంటే పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. దర్శకుడిగా కూడా ఆయన అదే తరహా సినిమాలే చేసాడు. ఇదివరకే వచ్చిన గులేబకావళి సినిమా కూడా పూర్తిస్థాయి కామెడీ చిత్రమే. అయితే ఈసారి ఆయన రూటు మార్చేశాడు. ప్రస్తుతం తమిళంలో ఫోల్ మాణిక్వెల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభుదేవా పవర్‌ఫుల్ సీరియస్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడట. ఇది పురాతన విగ్రహాల చోరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమాగా ఉంటుందట. చోరీకి గురైన ఆ విగ్రహాలను తిరిగి తన రాష్ట్రానికి తెప్పించే ప్రయత్నం చేసే అధికారిగా పోల్ మాణిక్వెల్ అనే అధికారి ఎంతో కృషిచేసాడు. ఇప్పుడు అదే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరోకాదు ప్రభుదేవా దగ్గర హిందీ సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన ఏసీ ముగిల్. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం.