Others

నరసింహ సీక్వెల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటేనే స్టయిల్. ఆయన సినిమాల్లోని స్టయల్ కోసమే మాస్ జనాలు ఎక్కువగా ఆరాటపడతారు. అలాంటి స్టయిల్‌తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న చిత్రం నరసింహ. నా దారి రహదారి అంటూ రజనీ చెప్పిన మేనరిజమ్స్ ప్రేక్షకుల్లో ఓ రేంజ్ క్రేజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ రజనీతో పోటీపడి మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే సన్నాహాలు జరుగుతున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అవును ‘పడయప్పా’ పేరుతో తమిళంలో హిట్ అందుకున్న ఈ సినిమా సీక్వెల్ పనిలో ఉన్నాడట సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్. తాజాగా ఆయన నందమూరి బాలయ్యతో చేసిన ‘జై సింహా’ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దాంతో ఈసారి మళ్లీ రజనీతో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. ఆమధ్య రజనీతో చేసిన ‘లింగ’ భారీ ఫ్లాప్‌గా నిలిచింది. అందుకే ఈసారి రజనీకి సూపర్‌హిట్ ఇవ్వాలన్న కసితో ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాడని సమాచారం. అందుకే నరసింహ సీక్వెల్‌పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక రజనీకాంత్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. రజనీకాంత్‌కు కూడా ఇప్పుడు మంచి హిట్ అవసరం.