Others

సందిగ్ధ ఆలాపన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటి నుంచో
వెంటాడుతుంది
రెక్క తెగిన ఒకానొక కల

పురాజ్ఞాపకాన్ని పురిట్లో పడేసి
వొళ్లంతా ఆక్రమించేసింది

ఈ లోకానికి నేను పరిచయం
కావడానికి
అమ్మ కడుపులో ఎన్ని యుద్ధాలో

విచ్ఛిత్తి కాకుండా సజీవంగా
నేలపై నెలల పసికందుగా
మరణం తరువాతి పుట్టుక
ఓటమి నుంచి గెలుపునకు
ఎదగడం కోసం
ఎన్నో ఏళ్ల కల రూపమై
కళ్లెదుట

అస్తిత్వ ఆలాపన
ఎప్పటికీ ఆగేది కాదు..
సందిగ్ధపు సంక్లిష్టతని
చీల్చుకొని

పాడే గొంతులకి
ప్రాణమై నిలిచిపోవాలి!
*

-పుష్యమీ సాగర్.. 9032215609