Others

బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత చక్కనిది
‘దిండు’ తో మన బంధం
మనం కనే కలలకు అదే సాక్ష్యం!
సేదతీరేవేళ
నీడలా వెన్నంటే వుండి
కాస్తుంది పహారా!
పన్నీరు వంటి
పరిమళాలను వెదజల్లే
మల్లెల గుబాళింపులతో
పరవశించడమే కాదు
అప్పుడప్పుడు
కన్నీరుతో తడిసి
ముద్దవడమూ
దానికి తెలుసు!
ముక్కలు చెక్కలైన హృదయాన్ని
అతకడానికి ఎంచక్కా
తన అక్కున చేర్చుకుని
అమ్మలా లాలిసుంది !
నిద్రాదేవి అలకబూనిన క్షణాన
‘నేనున్నానంటూ
మన సరసన చేరి ..
మనసు చెప్పే ఊసులకు
‘‘ఊ’’ కొడుతూ ‘‘జో’’కొడుతుంది!
మగత నిద్రలోకి జారాక
మదిగదిలో సవ్వడి చేసే వౌన గీతికలను
ఒడిసి పట్టి తెల్లారాక భద్రంగా
వాటిని మనకప్పజెప్పుతుంది

- దాస్యం సేనాధిపతి 9440525544