Others

చిరునవ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రరాని కళ్ళతో
వ్యథ నిండిన మనసుతో
నన్నొంటరిగా వదిలేసి
ఎన్ని రాత్రుళ్ళు గతించాయో!

కలలు ఎరుగని
కనురెప్పల పరదాలు
నిను కానక ఎన్ని
కన్నీటి మేఘాలయ్యాయో!

ఏ రోజు నువ్వు వస్తావోనని
ప్రతీరోజు దారంతా
కమలాలు పరచి
కరములు ఎంత కందాయో!

అలసిన తనువుకు
నీవొస్తావనే ఆశతో బలమిస్తూ
ఎన్ని క్షణాలను
నీ కోసం ఆహూతిస్తున్నానో!

చిరునామా విడిచావో
ననే్న మరచావో
చిరునవ్వా ఓసారొచ్చిపోవూ
మనసారా నిను చూడాలనుంది!

- సురేంద్ర రొడ్డ, 9491523570