Others

సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత సిమెంటు ఇండ్లు అయితేనేమి
మూలవాసుల నివాసాల్లోకి
ఆర్యులు చొరబడ్డట్టు
ఇటీవలి ఏలికల్లా
గృహములోకి ఎలుకలు చేరాయ

ర్యాకుల్లోని అపురూప పుస్తకాలను చెడగొడుతున్నాయ
వండిన గినె్నల మూతలను పడగొడుతున్నాయ
ఆఖరికి నిద్రిస్తున్నప్పుడు
కాళ్ల మడమలను కొరుకుతున్నాయ

ఇల్లంతా ట్రాఫిక్ జామ్‌లా ఎలుకలు
వాటి సకుటుంబ సపరివారమున్నూ

బెడదను నివారించడానికి
పక్కింటి పిల్లి పిల్లను సుకుమారంగా పెంచినం
మూడు పూటలా పాలూ అన్నం తిని తిని
సంకేతంగానైనా అరవడం కరవడం మాని
తన సహజ లక్షణం కోల్పోయ మాంసాహారం బంద్ చేసింది
కుట్రబాజి బ్రాహ్మణ్యంలా శాకాహారిలా ధాన్యంలోకి పోయంది
గతంలో కన్నా
ఎలుకలు వీరవిహారం చేస్తున్నాయ

ఈసారి బోనును తెచ్చాను
హుషారు ఎలుకలు ఒక్కటీ చిక్కలేదు
చట్టం తన పని తాను చేసుకుపోయనట్టు
సూపర్ మార్కెట్లో ర్యాట్ ప్యాడ్ తెచ్చినా
ఒక్కటీ చిక్కలేదు

ఎలుకల నివారణ చర్యలు నిర్వీర్యం
వీటికి తోడు ఆధిపత్యం పోయ
ప్రాంతీయ పందికొక్కు చేరిందని
మా ఆవిడ మూడవ తుపాను హెచ్చరిక

వాళ్లకు మాకు మధ్య
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది
ఎలుకలు సరిహద్దు దాటి
బహుజనులకు విస్థాపనకు గురిచేస్తున్న రాజ్యంలా
పక్కింట్లోకి చొరబడ్డాయ

పిల్లికి ఎలుక సాక్ష్యంలా
కొన్ని అవకాశవాద ఎలుకలు
పదవుల కొలువులు తీరి
మద్దతుగా పెదవులు చప్పరిస్తున్నాయ

ఇదే అదనుగా
వాళ్లు మా ఇంటిమీద దాడులు చేయాలని
రాష్ట్ర కేంద్ర అవినీతి నేర నిరోధక శాఖలకు
ఇ-మెయల్, ఫ్యాక్స్, కొరియర్ ద్వారా
ఫిర్యాదు చేశారు

ఎలుకలను మించిన
పందికొక్కులను మించి
మొసళ్లు తిరుగుతున్నాయని
అధికారులు నిర్ధారణకు వచ్చి
ఉమ్మడి నివేదిక సమర్పించారు

దేశమంతా అల్లర్లు చెలరేగాయ
ఆదేశించని కర్ఫ్యూ నూటానలభై నాలుగు
అమలు అవుతుంది
ఎలుకల వ్యవహారం ఇప్పుడు
జాతీయ సమస్య అయ్య కూర్చుంది

- జూకంటి జగన్నాథం