Others

నవ్విచూడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా నవ్వి చూడు
ఎన్ని అద్భుతాలు జరుగుతాయి
ఎన్ని అపార్థాలు తొలగిపోతాయో!
ఎన్ని సమస్యలు పరిష్కరించబడుతాయి
ఎన్ని చెడ్డరోజులు దూరమవుతాయో!
నవ్వి చూడు
ముత్యాలు దొరులుతాయి
నవరత్నాలు రాలుతాయి
నవనాడులు కదులుతాయి
చాలా రోగాలు పారిపోతాయో!
నవ్వి చూడు కలతలు తీరిపోతాయి
దూరాలు చెరిగిపోతాయి
స్నేహహస్తాలు దొరుకుతాయో!
మధురక్షణాలు లభిస్తాయి
అప్యాయతలు అల్లుకుంటాయి
రక్తసంబంధాలు వికస్తాయో!
నిజంగా నవ్వి చూడు...
నీకే అద్భుతావిష్కరణలు కలుగుతాయి

- గాదిరాజు రంగరాజు