Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణిత శాస్త్రం అంటే కేవలం అంకెలు కాదు! దాంతోపాటు అనేకానేక అంశాలు ఉంటాయి. అంక గణితం, బీజగణితం, రేఖా గణితం, జ్యామితి, త్రికోణమితి, గోళ గణితం వగైరాలు అన్నీ ఈ కోవలోకి చేరినవే. అలాగే లోహశాస్త్రం అంటే కేవలం ఇనుము గురించిన శాస్త్రం అని అనుకోవటానికి వీలు లేదు. దాంతోపాటు ఖనిజ శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైమానిక శాస్త్రం, యంత్ర శాస్త్రం (మెకానికల్ ఇంజనీరింగ్) వగైరాలన్నీ కలిసి వుంటాయి. వీటిలో కొన్ని ప్రధాన అంశాలవను రేఖామాత్రంగా పరిశీలిద్దాం.
లోహాల ప్రసక్తి లోహ మిశ్రమాల ప్రసక్తీ సాక్షాత్తుగా వేదాలలోనే వుండటం ఈ విజ్ఞానం యొక్క బహు ప్రాచీనతకు నిదర్శనంగా కనిపిస్తోంది. కృష్ణ యజుర్వేదంలోని చమకాధ్యాయంలో ‘హిరణ్యం చ మే యశ్చ మే’ అన్న మంత్రంలో బంగారం, ఇనుము, సీసం, ఉక్కు వగైరా లోహాల ప్రస్తావన వుంది. ఇలాంటి ప్రస్తావనలు అథర్వణ వేదంలో కూడా వున్నాయి. ఉదాహరణకు, ‘హరితే త్రీణి రజితే త్రీణి అయసి త్రీణి తపసా విష్టితాని’ అనే మంత్రంలో బంగారం, వెండి, ఇనుముల ప్రసక్తి వుంది.
అలాగే ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, కౌటిల్లుడి అర్థశాస్త్రం, చరక సంహిత, మొదలైన గ్రంథాలలో కూడా లోహాల ప్రస్తావనగానీ వాటి మిశ్రమాల ప్రస్తావన గానీ వుంది.
సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తులో ‘నఖ కృంతనేన సర్వ కార్‌ష్టాయసం విజ్ఞాతం..’ అన్న మంత్రంలో ఇనుము ప్రస్తావన వుంది. అదే మంత్రంలో ‘తదృథా లవణేన సువర్ణం సందధ్యాత్ సువర్ణేన రజతం, రజతేన త్రపు, త్రపుణా సీసం, సీసేన లోహం, లోహేన దారు, దారు చర్మణా’ అన్నచోట లోహ మిశ్రమాల ప్రస్తావన వుంది. ఇలా లోహాల, లోహ మిశ్రమాల ప్రస్తావన వేదాలోనూ, ఉపనిషత్తులలోనూ వుంది. కాబట్టి ఆ కాలానికే లోహాల తయారీ విరివిగా మనవారికి తెలిసి వుండాలి.
ఇదిలా వుండగా, క్రీ.పూ.3000 ప్రాంతాలనుడి ప్రాచీన భారత దేశంలో ముడి లోహ ఖనిజాలను గనులనుంచి వెలికితీసి శుద్ధిపరచడం, లోవహ మిశ్రమాలను తయారుచేయడం మొదలైనవి అత్యంత విస్తారంగా వ్యాపించి వున్న పరిశ్రమలుగా మన దేశంలో ఉండేవి. బంగారం, వెండి, రాగి, ఇము, తుత్తినాగము వంటి లోహాలూ, కంచు, ఉక్కు వంటి లోహ మిశ్రమాలు, ఆ నాటికే ఇక్కడి నుండి విదేశాలకు విరివిగా ఎగుమతి అవుతూ వుండేవి- అని చారిత్రక ఆధారాలు చూపుతున్నాయి.
భారతదేశం, ఈజిప్టు, రోమ్‌లమధ్య జరిగే వస్తు వినిమయ వ్యాపారంలో భారతదేశం నుండి లోహాల ఎగుమతి ప్రధానంగా వుండేది. ఆ దేశాలలోని యుద్ధ అవసరాల కోసమూ, వ్యవసాయ సాధనాల నిమిత్తమూ, భారతదేశపు ఇనుముతోనూ, ఉక్కుతోనూ చేసిన పరికరాలకు ఎంతో గిరా వుండేది. చారిత్రక ఆధారాలను బట్టి, మధ్యధరా సముద్ర ప్రాంత (మెడిటరేనియన్) ప్రజలకు భారతదేశం నుంచి (అందులోనూ దక్షిణ భారతం నుంచి) ఆయుధాల సరఫరా జరిగిందని నిర్థారించవచ్చు. ప్రఖ్యాతి వహించిన డమస్కస్ బ్లేడుల తయారీలో వాడిన ఫూట్జ్ స్టీలు (ఒక రకం ఉక్కు) భారతదేశం నుంచి ఎగుమతి అయిందే! దీనిలో నానో టెక్నాలజీ వాడబడి వుందని ఇటీవలే గుర్తించారు. నిజానికి ‘పూట్జ్’ అనే మాట కన్నడంలోని ‘ఉక్కు’ అనే మాటనుంచి ఉద్భవించినదే! అంటే ‘క్రూసిబల్ స్టీల్’ అని అర్థం. ఇది ఉక్కులలో ఒక జాతి. క్రీ.పూ.2000 కంటే వెనకటి కాలానికి చెందిన కంచు, రాగి, వగైరా లోహ శిల్పాలు ఈనాటికి కూడా చెక్కు చెదరకుండా వున్నాయి. దీనిని బట్టి ఆనాటి భారతీయ లోహ శాస్తప్రు గొప్పతనాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. 18వ శతాబ్దపు బ్రిటీషు రికార్డుల ప్రకారం భారతదేశ వ్యాప్తంగా ఆ రోజుల్లో 20వేల కొలుములు (్ఫర్నేసులు) వివిధ లోహాలను ఉత్పత్తి చేస్తూ వుండేవట! ఇక్కడ ఒక విషయం విస్మరించరాదు. అంతకు ముందు కాలంలో విదేశీయుల దండయాత్రలలలో వేలాదిగా శాస్త్ర గ్రంథాలు, పారిశ్రామిక వాడలు ధ్వంసం అయ్యాయి. అయినా (రైళ్ళు లాంటి) రవాణా సౌకర్యాలు లేని ఆ 18వ శతాబ్దంలో ఇరవై వేల కొలుములు పనిచేస్తూ వుండేవంట, అది చిన్న విషయం కాదు.
లోహశాస్త్రం గురించిన అనేక విషయాలు భరద్వాజ మహర్షి రచించిన శాస్ర్తియ గ్రంథాలలో లభ్యవౌతున్నయి. బృహద్విమాన శాస్త్రం, అంశుబోధని అనేవి ఆయన రచనలోని ముఖ్యమైన శాస్త్ర గ్రంథాలు. భరద్వాజ రచితమైన బృహద్విమాన శాస్త్రంలోని మూషాధికరణంలో వివిధ రకాల లోహాలను కరిగించటానికి 407 రకాల మూసలున్నట్లు పేర్కొనబడింది. అవి 12 వర్గాలుగా వర్గీకరించబడ్డాయి.
ఏయే రకం లోహాలకు ఏ యే వర్గంలోని ఏయే సంఖ్యల మూస ఉపయోగకరమో క్లుప్తంగా ఆ గ్రంథంలో చెప్పబడింది.‘తేషాం గాలనే మూషాః ప్రత్యేకం వర్గతస్మృతాః’ ఈ లోహాలను కరగబెట్టటానికి వివిద వర్గాలలోని మూసలను స్వీకరించాలి అని అక్కడ చెప్పారు. ఇలా మూసవర్గం, సంఖ్య చెపితే మూసను గుర్తించే అవకాశం వుండటాన్ని బట్టి, ఆ రోజుల్లో విస్తారమైన పరిజ్ఞానమూ, సంప్రదాయమూ మన లోహ శాస్తక్రారులలో వున్నట్లు స్పష్టమతోంది. అలాగే వ్యాసటికలు (కొలుమలు) గురించి కూడా వివరించే అనేక గ్రంథాలు ఉండేవి.
పైన పేర్కొన్న భరద్వాజ శాస్త్రంలో కూర్మవ్యాసటికను వివరించే సందర్భంలో ‘కూర్మవ్యాసటికామేవముక్త్వా శాస్త్రానుసారతః’ అంటాడు. అంటే అంతకుముందే కొన్ని శాస్ర్తియ గ్రంథాలు వుండేవనీ వాటిని అనుసరించి చెబుతున్నాననీ అర్థం గదా!
కొలములకు గాలికొట్టే యంత్రాల (్భస్ర్తీకల) అవసరం వుంటుంది. ఈ భస్ర్తీకలు తయారుచేయటానికి ప్రత్యేక శాస్త్ర గ్రంథాలు వుండేవి.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి