Others

సోమరిపోతులకు పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమ సోమరిపోతుతనం ప్రదర్శిస్తూ అలా నిర్లిప్తతతో వుండిపోవడం అనేది కూడా దక్షిణ కొరియాలో ఒక క్రీడ, ఒక పోటీ అయిపోయింది. ఈ క్రీడని 2014లో శ్రీమతి యూప్స్‌యాంగ్ కనిపెట్టినప్పుడు కొన్ని పదులలో మాత్రం పరమ బద్ధకస్తులు దిగివచ్చారు. కాని, రుూ ఏడాది వేల సంఖ్యలో పనీ పాట చెయ్యకుండా ఉదాసీనంగా అలా దిగంతాల చూస్తూ కూర్చోగలం అంటూ జనాలు కదిలి వచ్చారు. దాంతో నాలుగు రౌండ్ల పోటీలు పెట్టి వడపోత పట్టాల్సి వచ్చింది.
చివరికి ఓ 70 మంది ‘యమాబద్ధకస్తులు’ నిలిచారు. దక్షిణ కొరియా రాజధాని స్వోల్‌లోని ‘సెంట్రల్ పార్క్ లాన్స్’మీద రుూ పోటీ జరిగింది.
‘‘ఏముందీ? గోళ్లు గిల్లుకుంటూ 90 నిమిషాలు కూర్చోడమేగా?’’ అనకండి. గోళ్లు గిల్లుకోకూడదు. పల్లు కుట్టుకోకూడదు. సెల్‌ఫోన్లుండవ్. ప్రక్కవాళ్లతో ‘హస్క్’దాకా ఎందుకూ, ‘‘హలో! హలో!’’లు కూడా వుండకూడదు. ముంజేతి గడియారం కూడా చూసుకోకూడదు. తలలో పేలూ, రుూళ్లూ నొక్కుకోరాదు. ఓ కునుకు తియ్యకూడదు, అది ముఖ్యం.
ఈ పోటీకి ‘స్పేస్ ఔట్’ అని పేరెట్టారు. పోటీదారులు లేచి పచార్లు చేస్తామంటే ‘‘అలాగే అవతలకి పొమ్మం’’టారు. మరీ అంత. ‘నెంబర్‌వన్’ అవసరం అయితే కార్డులు యిస్తారు. అవి యిలా ఎత్తి చూపాలి. న్యాయనిర్ణేతలే దానికి ఏర్పాటుచేస్తారు. అంతేగానీ ఆవలింతలు, కన్ను గీటడాలు కూడా ‘నై చల్తా’. ప్రతీ పదిహేను నిమిషాలకీ ఒకసారి డాక్టర్లు వచ్చి గుండెదడ (హార్ట్‌బీట్) ఎక్కువయిందేమోనని చూస్తారు. తొంభై నిమిషాల తర్వాత ఎవరి గుండె దిట్టంగా- బి.పి పెరగకుండా పనిచేస్తూ వుంటుందో వాళ్లకి బంగారు పతకం లభిస్తుంది.
ఇంకా ఏవో ఛోటా మోటా ప్రయిజులుంటాయి. ఇక రుూ పోటీని తిలకించడానికి వచ్చే ప్రేక్షకులు పార్కు పరిసరాలలో వున్న మేడలెక్కాలి. వాళ్లకి మాత్రం వినిపించే రన్నింగ్ కామెంట్రీ వుంటుంది. ‘‘కమాన్! వేకప్’’ లాంటి గోలలూ, రుూలలూ పనికిరావ్ సుమా.
ప్రపంచం అంతా ఉక్కిరిబిక్కిరి పనులలో మునిగిపోతూ, పరుగులు తీస్తున్న ‘వర్కోహాలిక్స్’తో నిండిపోతోంది. దక్షిణ కొరియావాలయితే ‘యమ బిజీ’. ఆరోగ్యం ఏమవుతుంది? దాన్ని కాపాడాలీ అంటే యిలా నిర్‌వ్యాపార, నిర్లిప్త నిర్వాణ స్థితిలోకి వెళ్లాలి కాసేపు. ఈసారి బంగారు పతకం ‘షిన్ హ్యూ స్వోబ్’ అనే ‘ర్యాప్ డ్యాన్సర్’కి లభించింది! కంగ్రాట్స్!