Others

21రకాల బ్యాక్టీరియాతో పోరాడే పండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

31గ్రా. పిండిపదార్థాలు, 2 గ్రా. ప్రోటీన్లు, బీటా కెరోటిన్, థైమీన్, రిబోప్లోవిన్, నియాసిస్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఆక్సాలిక్, మాలిక్, సిట్రిక్ ఇలా ఎన్నో మినరల్స్, విటమిన్స్ ఉన్న ఈ వెలగ అరోగ్యానికి కలిమి. ఈ వెలగ పండును ఆయుర్వేద వైద్యులు వెలకట్టలేని ఔషధం అంటారు. ఈవెలగ పండును ఔషధంగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత ను దూరం చేస్తుంది. అలసట, నీరసంగా అనిపిస్తే వెలగ గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే తక్షణం శక్తి వస్తుంది. మూత్రపిండాల వ్యాధిని అరికడుతుంది. కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. హృద్రోగులకు మంచి టానిక్ ఈ వెలగపండు. కంటి చూపుకు మేలు చేస్తుంది. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. వెలగగుజ్జు తినడం వల్ల వీర్యవృద్ధి తోడ్పడుతుంది. నోట్లో పండ్లను తగ్గిస్తుంది. పొట్టలో గ్యాస్‌ను తగ్గిస్తుంది. నరాలకు ఉత్తేజాన్ని శక్తిని ఇస్తుంది. ఇన్ని రకాలుగా పనిచేసే వెలగపండే కాదు ఈ చెట్టు బెరడు, పూలు, వేళ్లు, ఆకులు కూడా ఔషధంగా పనికి వస్తాయి. ఈవిషయం గుర్తించమనే వినాయక చవితినాడు వినాయకునికి సమర్పించే 21 రకాల పండ్లల్లో వెలగపండు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

- లక్ష్మీప్రియాంక