Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ 1600 ఏళ్ళలోనూ ఈ పూత మందం 50 మైక్రాల్‌కు పెరిగిందట! ఈనాడు మిసావైట్ అని పిలవబడే ఈ పూత వజ్ర లేపనాలలో ఒకటి అయి వుండవచ్చు.
అలాగే ప్రస్తుతం బ్రిటీష్ మ్యూజియంలో ఒక బుద్ధ విగ్రహం వుంది. అది బీహారులో లభ్యమైంది. 4వ శతాబ్దానికి చెందిన ఈ రాగి విగ్రహం ఒక టన్ను బరువు, 2.1 మీటర్ల ఎత్తు వుంది. అది కూడా ఈనాటివరకూ చెక్కు చెదరలేదు.
ఇలా అనేక లోహాల తయారీ, లోహ మిశ్రమాల తయారీలు, మన ప్రాచీన భారతీయుల ప్రత్యేకత! విశేషంగా జింక్ యొక్క లోహ మిశ్రమాలు భారతదేశీయుల ఘనత!
యూరపు శాస్తజ్ఞ్రులు క్రీ.శ.1746లో జింకు తయారీ నేర్చుకున్నారు. కానీ భారతీయులు రెండు వేల యేళ్లకు ముందే జింకును ఆవిరి బట్టీల ద్వారా తయారుచేసేవారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ దగ్గర జవార్‌లో దాదాపుగా యథాతథంగా వున్న ప్రాచీన భారత జింకుబట్టీల అవశేషాలు లభ్యమయ్యాయి. దాన్నిబట్టి ఈ విశేషం బైటపడింది.
ఋగ్వేదంలో ముడి ఖనిజంలోంచి వివిధ లోహాలను వెలికితీసే విధానాలు కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లోనే వేటకోసం, యుద్ధంకోసం, వ్యవసాయంకోసం, గృహ నిర్మాణంకోసం ఇనుప పరికరాలను వాడినట్లు తెలుస్తున్నది. లోహ కర్మకారులు తమ ఇనుప వస్తువులను కొనగల ధనవంతులకోసం ఎదురుచూస్తున్నారని కూడా ఋగ్వేదంలో ఉన్నది.
కౌటిల్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో ఒక ప్రసక్తిలో లోహాలను వెలికితీసే విధానం చెప్పాడు.
సామాన్య ప్రక్రియ:- ఇనుము+ ఇతర క్షారాలు (Alcalies) కలిసి ముడి సరుకుగా దొరుకుతాయి. వీటిని ఆవుపాలలో వేసి కాచితే గట్టిదనం లేని లోహం (Brittle) బయట పడుతుంది. దీన్ని తేనె+గొఱ్ఱె పాలు+ నువ్వుల నూనె + వెన్న+ బెల్లం+ కుక్క గొడుగులు వీటిలో నానబెడితే మెత్తని లోహం బయటపడుతుంది (సువర్ణము).
అంశుశోధినిలో రూపగ్రహణం(Photography) గురింఛి అందులో ఉపయోగించే వివిధ రకాల కటకాల (Lenses) గురించి సవివరంగా తెలియచేశారు.
బాణాల ములుకులలోని లోహాలు, వాటిని పదునుపెట్టే ప్రక్రియలు, గదలు, కత్తులు మొదలైన వాటి గురించి పాకలపాటి రాజగోపాలకవి తమ ధనుశ్శాస్త్రంలో వివరించారు.
యజుర్వేదంలో హిరణ్యంచ మే- అయశ్చ మే- సీసంచ మే- త్రపుశ్చమే- శ్యామశ్చ మే- లోహశ్చ మే- (చమకప్రశ్న 5వ అనువాకం)అని లోహ ప్రసక్తి ఉంది.
హిరణ్యం= బంగారం
అయః = తెల్ల ఇనుము
సీసం= లెడ్
త్రపుః= తగరం (టిన్)
శ్యామః= నల్ల ఇనుము
లోహః= రాగి (కాపర్)
8th Century A.D వచ్చేసరికి ‘‘రసరత్నసముచ్చయము’’ వంటి గ్రంథాలు Iron- Carbon Alloys I

1) కాంత లోహమని (Soft Iron), 2) తీక్ష్ణ లోహమనీ (arbon Steel), 3) ముండ లోహమనీ (Cast Iron) విభజించాయి.
వీటిని మరింత విభాగం చేసి ‘‘రసవాగ్భటం’’లో
1) కాంత లోహాన్ని (Soft Iron)
భ్రామకం చుంబకం చైవ కర్షకం ద్రావకం తథా
ఏవం చతుర్విధం కాంతం రోమకాంతం చ పంచమం॥
భ్రామకం= చాలా మెత్తని అయస్కాంతిక ఇనుము
చుంబకం= సున్నితమైన అయస్కాంతం
కర్షకం= ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది.
ద్రావకం= దృఢమైన అయస్కాంతిక ఇనుము
రోమకం= దృఢమైన అయస్కాంతిక వలయంతో కూడిన శాశ్వత అయస్కాంతము.
2) తీక్ష్ణ లోసాన్ని (arbon Steel)
ఖరం = వంచితే విరిగిపోయేది
సారం= కొంచెం మెత్తనిది
సిన్నాలం= గట్టిది
త్రవరత్నం లేక త్రివృత్తం= అంచులు పదునుగా వస్తాయి
వజ్రం= అంచులు పదునుగా వస్తాయి. కొంచెం నీలిరంగు ఉంటుంది.
కాలం (కాలయానం)= ఇంకా బలమైనది
3) ముండ లోహాన్ని (Cast Iron)
మృదు = దీని కరుగుదల శక్తి తక్కువ
కుండం= కరిగిపోవు ఇనుము
కదరం= తెల్లని పోత ఇనుము
అని విభాగాలు చేశారు.
300 బి.సి నాటికే ప్రపంచ ప్రఖ్యాతమైన Wootz Steel (ఉక్కు) హైదరాబాద్ ప్రాంతంలో వాడుకలో ఉండేది. ఈ ఉక్కుతోనే ప్రపంచ ప్రఖ్యాతమైన "Damascus Swords'' తయారయ్యేవి. ఇవి హైదరాబాద్ ప్రాంతంలోని ‘‘కోణ సముద్రం’’లోనూ, కర్టాటక రాష్ట్రంలోని ‘‘సేలం’’లోనూ తయారయ్యేవి. 300 బి.సి నాటికే ఈ ఖడ్గాలు ప్రపంచ ప్రసిద్ధాలుగా వుండేవి. ఈ తయారీ విధానం ప్రపంచంలో వీరికి మాత్రమే తెలుసు. వీటిపై పొదల మీద ‘‘నానో పార్టికల్స్’’ ఉన్నవని ఇటీవల పరిశోధనల్లో తెలిసిందట. దీన్ని గురించి ఇంతకుముందే ఒకసారి ప్రస్తావించుకొని వున్నాం.

ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643