Others

అమృత హృదయిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా జీవన ఉద్యానవనంలో విరిసి జారిపోయిన నా బాల్యం నాకింకా గుర్తే
అమ్మా! అని నే పిలిచిన నా తొలిపలుకును విని
నన్ను తన హృదయానికి గాఢంగా హత్తుకుని ముద్దులతో ముంచివేయడం నాకింకా గుర్తే
మా ఊరి సెలయేటి అలలతో పోటీపడి నే సేకరించిన గవ్వలు,
దాచిపెట్టుకున్న నెమలి కన్నులు అన్నీ అమ్మకు చూపించడం
ఆమె కన్నులల్లో మెరిసిన నా మెరుపులు నాకింకా గుర్తే
నేను తూనీగలాగా స్నేహితులతో పరుగులుతీస్తూ, మామిడికాయలు కోస్తూ
తోటమాలి అదిలింపుతో...
పరుగు పరుగున వచ్చి అమ్మ ఒడిలో నా ముఖం
దాచుకుంటే అమ్మ నా వీపును నిమరడం నాకింకా గుర్తే
బడిలో బెత్తం పట్టుకుని ఎందుకు చదవలేదని బెదిరించే మాష్టారు
తప్పించుకుని అమ్మా అని నే రాగం తీస్తుంటే
అమ్మ నన్ను ఓదార్చడం నాకింకా గుర్తే
గుడిలో హరికథ వింటూ గోడకానుకుని నిద్రపోయిన నన్ను
భుజాన వేసుకుని ఇంటికి తెచ్చి జోకొట్టడం నా కింకా గుర్తే
ఆ అమ్మే నా భవిష్యత్తుకు బంగరు బాటలు వేసింది
ఆ బాటల్లో నే నడుచుకుంటూ నేడు విజయపథాన నిలిచాను
అమ్మకు ఏమిస్తే నా ఋణం తీరుతుంది?
ఆమెను స్మరించడం తప్ప ...

- కె.జి. దేవి , 9440331831