AADIVAVRAM - Others

విహంగాల జీవన శైలి ఎందుకిలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా పఫిన్ పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కారణాలేంటో తెలుసుకునేందుకు ఓ అంతర్జాతీయ సంస్థ పరిశోధన ప్రారంభించింది. శాస్తవ్రేత్తలు చిన్న చిన్న జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను సముద్ర పక్షుల శరీరాలకు అమర్చి వాటి కదలికలను గమనిస్తున్నారు. ఈ పక్షుల సంఖ్య బాగా తగ్గిపోతున్న ప్రాంతాల్లో కూడా ఇలాగే పరిశోధనలు చేసి ఈ ప్రాంతాల్లోని పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్కోమర్ ద్వీపం సముద్ర పక్షులకు పెట్టింది పేరు. ఇక్కడ పఫిన్ పక్షులు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అయితే దశాబ్దాలుగా యూరోప్ ప్రాంతంలో, ముఖ్యంగా బ్రిటన్‌లో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. చివరకు ఇవి అంతరించిపోయే పక్షిజాతుల జాబితాలో చేరాయి. కానీ స్కోమర్ ద్వీపకల్పంలో మాత్రం భిన్నమైన పరిస్థితులను గమనిస్తున్నారు శాస్తవ్రేత్తలు. స్కోమర్ ద్వీపంలో గత ముప్ఫై ఏళ్లలో ఈ పక్షుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఈ అనూహ్య మార్పులు ఎలా చోటు చేసుకుంటున్నాయి, తద్వారా వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు శాస్తవ్రేత్తలు. ఈ పరిశోధనలో పక్షుల ఆహార అలవాట్లను ముందుగా పరిశీలిస్తున్నారు. అందుకోసం చిన్న చిన్న ట్రాకింగ్ పరికరాలు పఫిన్స్ వెన్ను భాగంలో అమర్చుతున్నారు. ఈ పక్షులు ఆహారం కోసం రోజూ 145 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయన్న విషయాన్ని పరిశోధన బృందం ఇప్పటికే కనిపెట్టింది. అవి ఎక్కడికి వెళ్తున్నాయనే విషయాన్ని మాత్రమే కాదు, వాటి భిన్నమైన ప్రవర్తనను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు పరిశోధకులు. వాటి రోజువారీ బరువును కూడా రికార్డు చేస్తున్నారు. అవి ఏం తింటున్నాయి? ఎలా ఎగురుతున్నా యి? ఎలా విశ్రాంతి తీసుకుంటున్నాయి? అన్న విషయాలు కూడా అర్థమవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అదే బృందం నార్వే, ఐస్‌లాండ్‌లలో కూడా ఈ పరిశోధన చేస్తోంది. అక్కడ ఈ పక్షుల సంఖ్య ఎందుకు తగ్గుతోందో తెలుసుకుంటున్నారు. బృందంలోని సభ్యులు ఈ పక్షుల నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని ఇతర వన్యప్రాణుల జీవన విధానాలతో పోల్చి చూస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల పఫిన్స్‌కు నష్టం కలుగుతోందా? లేదా? అన్న కోణంలోనూ పరిశోధనలు చేస్తున్నారు.