Others

బహుదూరపు బాటసారి( నాకు నచ్చిన సినిమా )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1983 మే 19న విడుదలై అఖండ విజయం సాధించిన ‘బహుదూరపు బాటసారి’ సినిమా అంటే మా కుటుంబ సభ్యులకు చాలా ఇష్టం. అక్కినేని, దాసరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ చిత్రం. అక్కినేనితోపాటు సుజాత, దాసరి నారాయణరావు, రామకృష్ణ, రాజా, భానుచందర్, సుహాసిని, సుమలత, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, ఈశ్వరరావు లాంటి నటులు తమ శక్తివంచన లేకుండా ఈ సినిమాలో నటించి ఈ సినిమాను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ సినిమాకు సుమధుర సంగీతం అందించినది రమేష్‌నాయుడు. నిర్మాత, దర్శకుడు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు.
దర్శకుడు దాసరి నారాయణరావు ఆయన గురువు శ్రీ పాలగుమ్మి పద్మరాజు సహకారంతో ఈ చిత్రానికి సంయుక్తంగా కథ అందించారు. అతి పటిష్టమైన స్క్రిప్ట్, ఆలోచింపచేసే సన్నివేశాలు, తరతరాలకు సందేశాన్ని అందించే మాటలు, మంచి పాటలు, నటీనటుల నటనా సహకారంతో ఈ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. మూడుతరాల కథతో ముందుతరానికి మూడు మాటలు అందించాలని దాసరి చేసిన కృషి ఫలించింది. ఈ చిత్రంలో దాసరి, అక్కినేని స్నేహితునిగా నటించారు. అక్కినేని ఇల్లు వేలంవేసి బజారులో పడితే దాసరి అతనిని ఆదుకుంటాడు. దాసరి కొడుకులు దాసరిని నీవెవరో గుర్తించుకోమంటే అక్కినేని దాసరిని మిత్రుడుగా ఆదుకొని అతని సంసారాన్ని నిలబెడతాడు. ఈ చిత్రంలో భార్యభర్తల బంధం, స్నేహబంధం, తల్లికొడుకుల బంధం, తండ్రి కొడుకుల బంధం, తాత మనవళ్ళ బంధం, యువకుల ప్రేమ, కర్తవ్యదీక్ష, కష్టాలలో ఆత్మబలం ప్రదర్శించి అక్కినేని విజయం సాధిస్తాడు. ఇలా అన్ని బంధాల కలయిక ఈ చిత్ర కథాసారం.
అక్కినేని, దాసరి ఇద్దరు మిత్రులు, అక్కినేని బాధ్యతగల పోలీసు అధికారి, దాసరి ప్రజలకు మాయమాటలు చెప్పి తిమ్మిని బమ్మినిచేసి తన పనులు సాధించుకొనే బతకనేర్చిన వ్యక్తి. అక్కినేని దర్జ్యంలో తన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడంవల్ల కడవరకు ఉద్యోగ బాధ్యత నెరవేర్చలేడు. కాలుపోయి ఇంటికే పరిమితం అవుతాడు. తన సంపాదన కొడుకులకోసం ఖర్చుచేస్తాడు. అక్కినేనికి అతని కొడుకులు ఒకరకంగా బుద్ధిచెబుతారు. కాని తన ఆత్మబలంతో ఆ కష్టాలు జయించి తన కుటుంబాన్ని కాపాడుకొని, ఒక వ్యక్తిసాయంతో ధనవంతుడు అవుతాడు. కొడుకులు, మళ్ళీ తండ్రి పంచనచేరుతారు. తల్లి వారిని క్షమించినా తండ్రి క్షమించడు. చివరకు ఆస్తిని తన కుమారుల పేర వ్రాసి వెళ్ళిపోతున్న అక్కినేనికి అతని భార్య సుజాత కలిసి తమ జీవిత ప్రయాణం సాగించడంతో కథ సుఖాంతం అవుతుంది.
ఈ సినిమా విడుదలై దాదాపు 35 ఏళ్లయనా ఈ చిత్ర కథ తరతరాలకు సందేశం అందిస్తూనే వుంది.
-పాణ్యం శ్రీనివాసరావు, కర్నూలు