Others

కొమ్మకొమ్మకో సన్నాయి..( నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమ్మకొమ్మకో సన్నాయి.. అనే వేటూరి పాట గోరింటాకులో అద్భుతంగా ఆవిష్కరించబడింది.
స్వరాల మామ కె.వి.మహదేవన్ అద్భుతంగా సంగీతాన్ని అందించిన పాట. ఇక సుశీల, బాలుగార్ల సంగతి చెప్పేదేముంది? తమ గానమధురిమతో ఆ పాటను గంధర్వ లోకాన్నుండి తీసుకొచ్చినట్లు చేశారు.
శోభన్‌బాబు, సుజాతల సహజ నటన ఆ పాటకు మరింత గొప్పదనం ఆపాదించబడింది. ఆమెది అనురాగం. అతనిది న్యూనతాభావం. ఆ రెండింటి సంఘర్షణలోనుండి వచ్చిన గీతమది. ఏమిటీవౌనం? ఎందుకీ ధ్యానం? అని ఆమె అంటే మనసులో వౌనం- మాటలో ధ్యానం అని అతను. ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి అని ఆమె అనుబంధాలను, ఆత్మీయతలను గుర్తుచేస్తుంది. ఎప్పుడే ముడి ఎవరితోపడి పడవ పయనం సాగునోమరి... అని అతను నిర్లిప్తంగా అంటాడు.
మన చేతుల్లో ఏమీలేదన్న భావం అతనిది. ఆత్మవిశ్వాసంతో దేన్నయినా గెలవచ్చన్న ఆశాభావం ఆమెది. మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది- అని ఆమె అంటుంది. మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది- అని అతను భారంగా బాధగా అంటాడు. మొత్తానికి గొప్ప పాటను మనకు అందించి, కీర్తిశేషులైన వాళ్లిద్దరూ (రచయితలు) అమరులు. ఈ పాటలోని అంతర్మథనం నాకు ఎంతో ఇష్టం.

- బి.మోహనకుమారి, చెన్నయ్