Others

జాతి సమగ్రతకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార పీఠం అంపశయ్య వంటిది. బైబిల్ పరిభాషలో ముళ్ల కిరీటం వంటిది. ఒక్క అడుగు కూడా ముందుకు సాగనివ్వని అభివృద్ధి నిరోధ క్షేత్రపాలకులున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా మాణిక్ చౌక్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించగా హింస చెలరేగింది. ఆ ర్యాలీని ఎన్నికల అధికారులు వీడియో తీస్తుండగా సిబ్బందిపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు. తెలంగాణలోని భద్రాచలం వద్ద ఓ సెల్‌టవర్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. ఛత్తీస్‌గఢ్‌లో సిఆర్‌పీఎఫ్ జవాన్లను మందుపాతరలు పెట్టి హతమార్చారు. ప్రతినిత్యం మనం ఇలాంటి వార్తలు చదివేందుకు అలవాటుపడిపోయాం.
కొన్ని దశాబ్దాల క్రితం మధ్యప్రదేశ్‌లో ‘చంబల్ వేలీ ఆపరేషన్’ జరిగింది. అక్కడి గజదొంగలను పోలీసులు పట్టుకొని విచారిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దొంగల వెనుక ఆనాటి కాంగ్రెస్ నాయకుల ‘హస్తం’ ఉందట! దొంగల దోపిడీలో వారికీ వాటాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనే తమిళనాడులోనూ జరిగింది. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా విలువ ఉంది. దానిని వీరప్పన్ వంటి స్మగ్లర్లు దోచుకోవడం ప్రారంభించారు. కావేరీ నది నుండి ఎర్ర చందనం దుంగలు సాగర తీరానికి చేరుతాయి. సముద్రంలోని మరపడవల ద్వారా వాటిని గమ్యస్థానానికి చేరుస్తారు. ఈ స్మగ్లింగ్ వెనుక బడా రాజకీయ నాయకుల ప్రమేయం లేకపోలేదు. ఇలాంటి వార్తలే ఏపీలోని తిరుమలేశుని శేషాచలం అడవులకు సంబంధించి వచ్చాయి.
ఒక ప్రముఖ రాజకీయ నాయకునికి అమెరికా నుంచి నిధులు వచ్చేవి. అనాథ పిల్లలకు పాలపొడి పాకెట్టు సోయాబిన్ ఆయిల్ పడవలలో మద్రాసు చేరేవి. వాటిని ఆయన మద్రాసులోనే అమ్ముకొని, పిల్లలకు పంచిపెట్టినట్లు లెక్కలు చూపించేవాడు. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది? ఈ దేశంలో నిజంగా ప్రభుత్వం ఉందా? ప్రభువులు భక్షకులు అయితే దేశం ఇట్లాగే అవుతుంది. రాజకీయ నేతలదే తప్పు కాదు, అలాంటి వారిని గెలిపించిన ప్రజలది కూడా.
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ గతంలో అత్యాచార ఘటనలపై వివాదాస్పద ప్రకటన చేశారు. ‘వాళ్లు యువకులు, చిన్నపిల్లలు.. ఏదో ఉద్రేకంలో రేప్ చేశారు. అంతమాత్రాన వారికి ఉరిశిక్ష వేయటం తగదు’ అని ములాయం చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బాలికలపై సామూహిక అత్యాచారాలు జరుగుతుండగా ములాయం వంటి నేతలు ఇలా మాట్లాడటం తగునా? అని మహిళా నేతలు ఆక్షేపించారు. రాజకీయ నాయకులు వోట్ల కోణంలోనే మాట్లాడుతుంటారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి నేతలు అసాంఘిక శక్తులతోనైనా జత కడుతుంటారు. ‘సిమీ’ వంటి ముస్లిం ఉగ్రవాద సంస్థలతో ములాయంకు సంబంధం ఉన్నట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ముస్లిం, యాదవ్‌ల బంధం విడదీయరానిదని కూడా ఆయన చెప్పుకున్నాడు. ఇలాంటి అపవిత్ర బంధాలతోనే సమాజ్‌వాదీ పార్టీ మనుగడ సాగిస్తోంది.
ఉగ్రవాదులతో, స్మగ్లర్లతో ఇంకా ఎంతోమంది రాజకీయవేత్తలకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. 1975లో హాజీ మస్తాన్ అనే ఓ అంతర్జాతీయ స్మగ్లర్ బొంబాయిలో ఉండేవాడు. అతడిని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీలో అరెస్టు చేయించింది. అపుడు హాజీమస్తాన్ ఇలా అన్నాడు..‘నిన్నటి వరకు నా ఇంటిముందు భిక్షాపాత్రలు పట్టుకొని నిధుల కోసం నా కాళ్లు పట్టుకున్న రాజకీయ నాయకులకు నేడు నేను స్మగ్లర్‌గా కన్పించడం విడ్డూరం’- ఇది నిజమే కదా! భారత రాజకీయ వ్యవస్థలో అవినీతి అంతర్భాగమైంది. అవినీతి అసలు సమస్యే కాదని ఆనాటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు వ్యాఖ్యానించారు. అవినీతి కార్యకలాపాలకు ఏ పార్టీ కూడా అతీతం కాదు. కేరళలో పినరయి విజయన్ అవినీతిపరుడని ఆనాటి ముఖ్యమంత్రి అచ్యుతానందన్ ఆక్షేపిస్తే విజయన్‌కు బదులు అచ్యుతానందన్ మీద సిపిఎం వేటు వేసింది. ‘ఎందుకు హింసకు పాల్పడుతున్నారు?’ అని తృణమూల్ కాంగ్రెస్ వారిని అడిగితే ‘వామపక్షాలను ఎదుర్కోవాలంటే వేరే మార్గం లేదు’ అని సమాధానం చెపుతున్నారు.
ప్రజాక్షేత్రంలో రక్షణశక్తికి ప్రాధాన్యం ఉందని మన ఋషులు గ్రహించారు. అందుకని సత్వశక్తితోబాటు రక్షణ శక్తికి ప్రాధాన్యం ఇచ్చారు. రావణుడిని రాముడు చంపకపోతే వాల్మీకి రామాయణం రాసి ఉండేవాడు కాదు. రాజధర్మం సమాజ రక్షణయే. హిరణ్యకశ్యపుడు తపస్సు చేశాడు. ప్రహ్లాదుడూ తపస్సు చేశాడు. కాని ఇద్దరి లక్ష్యాలు వేరు. రాక్షసుల తపస్సుకు సామాజిక గౌరవం లభించలేదు. ప్రపంచంలో పాలకులే దోపిడీదారులైతే అరాజకం వస్తుంది. ఇది రెండు, మూడు రకాలుగా ఉంటుంది. అవి- 1. విధ్వంసక శక్తులు అరాజకాన్ని సృష్టించడం 2.పాలకులే స్వయంగా అరాజకాన్ని పోషించటం 3. విధ్వంసక శక్తులను పాలకులు ఉపేక్షించడం. ఈ మూడు మార్గాల్లో సమాజం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. భారత్‌లో ఈ మూడు మార్గాలనూ నేడు చూస్తున్నాం. నక్సలైట్లకు, లాడెన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా పాలక వర్గాలే మద్దతునిచ్చాయి. వారిని శిక్షించడానికి బదులు వారి మద్దతుతో ఎన్నికలలో గెలిచాయి. వారి ఎజెండాలను అధికారికంగా అమలులో పెట్టాయి. అందుకు వారు వెంటనే ప్రతిఫలం కోరారు. తమపై నిషేధాలను తొలగించవలసిందిగా షరతులు పెట్టారు. ఇదంతా వర్తమాన చరిత్రే.
ఇక, నియంత్రణ లేని ద్రవ్య వినియోగం, సబ్సిడీలు ఆర్థిక రంగాల్లో అరాజకం సృష్టిస్తాయి. కుల విద్వేషాలతో పుట్టిన పార్టీలు మరో రకం అరాజకాన్ని సృష్టిస్తాయి. ముజఫర్‌నగర్, వారణాసి, హైదరాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో మతకల్లోలాల ద్వారా పాకిస్తాన్ తదితర శత్రుదేశాలు అరాజకాన్ని సృష్టిస్తున్నాయి. దీనిని ఎవరూ అడ్డుకోవడం లేదు. చైనా ప్రేరేపిత ఉగ్రవాదం మన ఈశాన్య రాష్ట్రాలను ధ్వంసం చేసింది. వీటిని నిరసించే మేధావి వర్గం కూడా లేదు. హిందూ దేవతలను ఇష్టానుసారం తిట్టడం కూడా విద్వేషాలను రగిలించడమే. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై డీఎంకే వంటి పార్టీలకు ఇంత ద్వేషం ఎందుకు? శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఎల్‌టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ తమిళ పార్టీలకు మిత్రుడయ్యాడు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, విలువలను నాశనం చేస్తున్న కొందరు నేతలను కారణజన్ములుగా కొన్ని ప్రాంతాల్లో జనం కీర్తించడం తగునా?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్