Others

ఓ మహా నాయకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మహా శిఖరమది
ఆ శిఖరం అద్భుతాల సంకేతం
అంత గొప్ప ఉన్నతితోపాటు
బలమైన విలువల మూలాలున్నాయి
చెదరని ధీరత్వం.. సడలని కచ్చితత్వం
పోతపోసిన భారతీయ తత్త్వం
హుందా అయిన నాయకత్వం
కలగలసి మానవ రూపం దాల్చింది

నాయకత్వమంటే ఏమిటో
హుందాతనం అర్థం ఏమిటో
నిజాయితీకి నిర్వచనమేమిటో
నిబద్ధతకు రూపం ఎలాంటిదో
వాజ్‌పేయి అవతారం తెలిపింది

ఓ సమున్నత ఆలోచనకు
ప్రగతిశీల ఆచరణకు వేదిక
స్వర్ణ చతుర్భుజి
గ్రామీణ సడక్ యోజన
టెలికమ్యూనికేషన్స్ విప్లవం

నదుల అనుసంధాన రూపశిల్పి
సున్నిత హాస్యచతురత
అద్భుత రాజనీతిజ్ఞత
ఆయన విశిష్టత

అటువంటి నేతలకు నేడు కొరత
ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి
నేటి నాయకులు కొంతలో కొంత
ఆ మహానుభావుని జాడలు
నిలవాలి విశ్వమంతా!
*

-- చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు