AADIVAVRAM - Others

అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక సందర్భాలు-
జీవితంలో అనేక సందర్భాలు ఉం టాయి.
కొన్ని పనులు చేద్దామని అనుకుంటాం. చేయలేకపోతాం.
ప్రయత్నించి విఫలమవుతాం.
ఉదయానే్న లేచి ఎన్నో పనులు చేద్దామని అనుకుంటాం.
కానీ 8 గంటల వరకు నిద్ర లేవకుండా ఉంటాం.
ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ
వాటిని సరిగ్గా ఉపయోగించలేక పోయి ఉంటాం.
ఎంతోమందిని మన మాటలతో బాధపెట్టి ఉంటాం.
తల్లిదండ్రుల మాటలు వినకపోయి ఉంటాం.
సరిగ్గా చదవకపోయి ఉంటాం.
పర్వాలేదు.
జీవితంలో ఎన్నో సందర్భాలు ఉంటాయి.
అప్పుడు పనులు చేయకపోయినా ఇప్పుడు
వాటిని చేయవచ్చు. అప్పుడు విఫలమైనా
ఇప్పుడు విజయం సాధించవచ్చు.
ఈ రోజు వరకు ఉదయం లేచి పనులు చేయలేకపోవచ్చు. కానీ రేపటి నుంచి చేయవచ్చు.
వచ్చిన అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకోలేక పోవచ్చు.
ఇప్పుడు ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఎంతోమంది మాటలతో బాధపెట్టి ఉండవచ్చు.
ఇప్పుడు సారీ చెప్పవచ్చు.
వాళ్లని సంతోషపెట్టే మాటలు ఇప్పుడు చెప్పవచ్చు.
తల్లిదండ్రుల మాటలు వినకపోయి ఉండవచ్చు.
ఇప్పుడు వినవచ్చు.
వాళ్లు చెప్పినవి పాటించవచ్చు.
సరిగ్గా చదవకపోయి ఉండవచ్చు.
ఇప్పుడు చదువుకోవచ్చు.
ఏమైనా చేయవచ్చు.
సమయం ముఖ్యమైందే!
పర్వాలేదు.
ఇప్పుడు చేయవచ్చు.
కావల్సింది-
మనం చేద్దామని అనుకోవాలి.
వాటిని వదిలి పెట్టకుండా ఉండాలి.
అంతే!
*

- జింబో 94404 83001