Others

ముహూర్తం కుదిరిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సైరా సినిమాలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేసాడు. ఆయన నెక్స్ట్ సినిమా క్రేజీ దర్శకుడు కొరటాల శివతో ఉంటుంది. ఇటీవలే మహేష్‌తో కొరటాల చేసిన భరత్ అనే నేను సంచలన విజయం సాధించడంతో కొరటాల జోరుగా తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు కొరటాలకోసం వెయిట్ చేస్తుంటే.. ఆయన మాత్రం తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్‌తో అని తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తయిన ఈ చిత్రంకోసం కొరటాల అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడట. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతుందట. అయితే మెగాస్టార్ సరసన హీరోయిన్ ఎవరా? అన్న విషయంపై ఆయన టెన్షన్ పడుతున్నారని టాక్. ఇక మెగాస్టార్ కూడా సైరా సినిమాకోసం మరో రెండు నెలలు వర్క్‌చేస్తే ఆ షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత వెంటనే కొరటాల సినిమాలో జాయిన్ అవుతాడు. సో.. అన్నీ కుదిరితే నవంబర్‌లో ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందట. ఈ చిత్రాన్ని కూడా రామ్‌చరణ్ నిర్మిస్తాడట.

--శ్రీనివాస్ ఆర్.రావ్