Others

వీరుడిగా ఎన్టీఆర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి లాంటి వండర్‌ను ఆవిష్కరించిన అమరశిల్పి జక్కన్న.. అదే రాజవౌళి తదుపరి సినిమా ఏమిటనే సందేహాలను పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్ - చరణ్‌లతో మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. ఆ సినిమా అనౌన్స్ వచ్చినప్పటినుండి సినిమాపై రకరకాల పుకార్లు మాత్రం పుట్టుకొస్తున్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కథ విషయంలో మరో రూమర్ పుట్టుకొచ్చింది. అదేమిటంటే ఈ సినిమా 1947కి పూర్వం జరిగే కథతో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అటు రాజవౌళి కూడా సైలెంట్‌గా ఉండడంతో అందరు ఇదే నేపథ్యం అని ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రపై కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. అదేమిటంటే.. ఎన్టీఆర్ స్వాతంత్య్ర సమరయోధుడిగా కనిపిస్తాడని.. ఆయన పాత్ర అల్లూరి సీతారామరాజు షేడ్‌లో ఉంటుందంటూ జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రాజవౌళి తండ్రి అద్భుతమైన కథ ఇచ్చాడంటూ ప్రచారం అయితే జోరుగా ఉంది. మరి ఇందులో నిజంగానే ఎన్టీఆర్ సమరయోధుడిగా కనిపిస్తాడా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి వుంది. అన్నట్టు ఈ చిత్రాన్ని నవంబర్‌లో సెట్స్‌పైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

--శ్రీనివాస్ ఆర్.రావ్