Others

అవయవ దానంతో జన్మ చరితార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని దానాల్లోకెల్లా ప్రాణదానం మిన్న అంటారు. అలాగని తమ ప్రాణాన్ని ఎవరూ దానం చేయరు. కాని ఎవరైనా వ్యక్తి ప్రాణం పోతున్న సమయంలో అతని శరీరంలోని పనికొచ్చే అవయవాలు ఇతరుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి ప్రాణాలు పదిలపరుస్తాయి. ఇది అవయవ దానమైనా ప్రాణదానంతో సమానం. విధివశాత్తూ పోయే ప్రాణాలు- జీవశ్చవాలుగా బతుకుతున్న ఎందరికో జీవితం ప్రసాదిస్తాయి. మరణానికి చేరువైన వ్యక్తినుంచి అవయవాలు సేకరించి, ఎనిమిదినుంచి పది మందికి ప్రాణదానం చేసేలా నేడు ఆధునిక సాంకేతికతో వైద్యరంగం అభివృద్ధి చెందింది.
రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల కొందరు కోమాలోకి వెళ్లిపోతారు. వైద్య సహాయం అందించినా ఫలితం లేకపోతే మెదడు పని ఆగిపోవడాన్ని మరణావస్థ (బ్రెయిన్ డెడ్) అంటారు. అతను బతకడం కష్టమైనా, వైద్యుల పర్యవేక్షణలో ఇతర ముఖ్యమైన అవయవాలు పనిచేస్తుంటాయి. ఇలాంటి సమయంలో అతని బంధువులు ఒప్పుకుంటే, పనిచేసే ఆ అవయవాలను ఇతరులకు అమర్చవచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. ‘బ్రెయిన్ డెడ్’ అయినట్టు వైద్యులు నిర్ధారించాక, ఆ వ్యక్తి శరీరంలోని మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమగ్రంథి, కళ్ళు, ఎముక మజ్జ, చర్మం వంటివి ఇతరులకు అమర్చవచ్చు. ఇలా ఒక మనిషి అవయవాల ద్వారా 8నుంచి 10 మందికి ప్రాణదానం చేయగల మహత్తర అవకాశం ఉంది.
గ్రీన్ చానల్ విధానం
అవయవదానం అంటే మరణాన్ని గెలవడం. ఆ గెలుపు ఎలా సాధించాలన్నది గ్రీన్ చానెల్ చెపుతుంది. వ్యక్తి చివరి దశలో ఉన్నప్పుడు అతని కుటుంబ సభ్యులు సమ్మతిస్తే దాత శరీర భాగాల్ని వైద్యబృందం పర్యవేక్షణలో, సురక్షిత రీతిలో రోడ్డు, విమాన మార్గాల ద్వారా వేగవంతంగా తరలించడాన్ని ‘గ్రీన్ చానెల్’ విధానంగా వ్యవహరిస్తారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, సమన్వయంతో జరగాల్సింది. ఆపదలో ఉన్న ఒక మనిషిని బతికించడానికి పడే యాతన ఇది.
‘నీవు చనిపోతే నీవెంట ఎవరూ రారు, నువ్వు చనిపోయినా కొందరిని అవకాశం ఏ జన్మ పుణ్యం వల్లో వచ్చిందనుకోవచ్చు. నీ ఆరోగ్యకర అవయవాలతో ఎన్నో ప్రాణాలు పునర్జన్మ పొందుతాయి. చాలా దేశాల్లో 70 శాతం ప్రజల అవయవ దానానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. స్పెయిన్‌లో బ్రెయిన్‌డెడ్ అయిన వారినుంచి అవయవాలు సేకరించడానికి, వారు కుటుంబీకుల అంగీకారం అవసరం ఉండదు. దీంతో ఆ దేశంలో అవయవ దానం- మార్పిడి చికిత్సలు బాగా జరుగుతున్నాయి. తర్వాత వరుసలో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలున్నాయి. ఆసియా దేశాల్లో మరణం పట్ల మతపరంగా నిశ్చితాభిప్రాయాలు ఉండటం వల్ల, వారిని ఇందుకు అంగీకరింపచేయటం కష్టమవుతుంది. మృతుని శరీరం నుంచి కొన్ని అవయవాలను తొలగిస్తే వారి ఆత్మకు నిష్కృతి ఉండదనే నమ్మకంతో వెనకంజ వేస్తుంటారు. చైనా ‘సేవ్ లైఫ్ ఆర్గ్’అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి, స్వచ్ఛందంగా ఎవరైనా పేర్లు నమోదుచేసుకోవచ్చని చెప్పటం, అవయవాల సమీకరణ జరగటం జరుగుతోంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రీలు ఏర్పాటుచేసి చైతన్యపరుస్తున్నారు. అవయవ దానం పట్ల ఐరోపా దేశాల్లో ఉన్నంత అవగాహన ఆసియా ప్రాంతంలో లేదు. ప్రపంచ జనాభాలో ఆసియన్లు 60 శాతం ఉన్నా, ప్రపంచ అవయవ దానాలలో ఆసియా వాటా కేవలం 4% మాత్రమేనట.
భారత్ విషయానికొస్తే 2013లో యూపీఏ ప్రభుత్వం మొదట జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (నోట్టో)ను ఏర్పాటుకు కృషిచేసింది. 2014లో మోదీ ప్రభుత్వం ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నోట్టోను ఏర్పాటు చేసి, 24 అవయవ సేకరణ మార్పిడి కేంద్రాలతో కంప్యూటర్ యంత్రాంగం ద్వారా అనుసంధానం చేసింది. దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడు కార్యాచరణంలో ముందుంది. తమిళనాడులో ప్రారంభించిన అవయవ దాన రిజిస్ట్రీ దక్షిణ భారత రాష్ట్రాలన్నింటికీ ప్రాంతీయ అవయవ మార్పిడి సమన్వయ కేంద్రం (రోటో)గా పనిచేస్తోంది. అవయవ మార్పిడిలో ముందుంది. మృతదేహాల నుంచి అవయవాలు తీసి, అవసరమైన వారికి, మార్పిడి చేయడానికి దే శంలోనే మొట్టమొదటిసారిగా ‘కెడీవర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అథారిటీ’(సీటీఏ)ను ఏర్పాటు చేయబోతున్నారు. తమిళనాడు తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ‘జీవన్‌దాన్’కు మంచి స్పందన లభించింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ శాఖను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ ఆర్గాన్ (అవయవ) బ్యాంకును ఏర్పాటుచేస్తారు. అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయనవారు అవయవ దానాన్ని పరమార్థంగా భావిస్తే మరికొందరి జీవితాలు వెలుగులు నిండుతాయ.

-లోకనాధం సత్యానందం