Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీ.పూ.మూడువేల ప్రాంతం నాటి మహాభారత శాంతి పర్వంలో భృగు భరద్వాజుల సంవాదంలో వృక్షాలకు ప్రాణం వుందనీ, పంచేంద్రియలు కూడా పనిచేస్తాయనీ చెప్పబడింది.
ఆకులు, బెరళ్ళు, పూలు, పళ్ళు కూడా వేడికి వాడిపోతున్నాయి. క్రమంగా రాలిపోతున్నాయి. కనుక చెట్లకు స్పర్శజ్ఞానం వుంది.
గాలి, నిప్పు, పిడుగు మొదలైనవాటి ధ్వనివల్ల పళ్లు, పూలు రాలిపోతున్నాయి. శబ్దాన్ని చెవి మాత్రమే గ్రహించగలదు. కనుక చెట్లకు వినే శక్తి వుంది.
తీగ చెట్టును పెనవేసుకుంటుంది. అన్ని వైపులకూ పాకుతుంది. చూపులేని వారికి గమనం ఎలా కుదురుతుంది. కనుక చెట్లకు చూసేశక్తి వుంది.
మంచి సువాసనలు మంచి ధూపాలూ వుంటే చెట్లు రోగాలు లేకుండా ఏపుగా పూత పూస్తున్నాయి. దుర్వాసనలు, చెడు ధూపాలూ వుంటే అవి రోగగ్రస్తాలై పూత తగ్గుతుంది. కనుక చెట్లకు వాసన చూసే శక్తి వుంది.
చెట్లు వేళ్ళతో నీళ్ళు తాగటం కనిపిస్తోంది. వాటికి తెగుళ్ళు రావడం, మందులు వేస్తే తగ్గిపోవడం కనిపిస్తోంది. కనుక చెట్లకు రుచి చూసే శక్తి వుంది.
చెట్లలో సుఖమూ దుఃఖమూ కనిపిస్తున్నాయి. విరిచేస్తే మళ్లీ మొలుస్తున్నాయి. కనుక చెట్లలో జీవాన్ని నేను చూస్తున్నాను. వాటికి చైతన్యం లేదనే మాటే లేదు.
అందుకనే ఆ చెట్లు పీల్చిన జలాన్ని అగ్నివాయువులు జీర్ణింపచేస్తున్నారు. ఆహార పరిణామం వుంది గనుక చెట్లలో స్నేహ గుణమూ (చమురు గుణమూ) అభివృద్ధి కలుగుతున్నాయి.
తామరతూడు వంటి గొట్టంతో మనం నీటిని పైకి ఎలా పీలుస్తామో అలాగే చెట్టు కూడా వాయు సహాయంతో తన వేళ్ళతో నీటిని పైకి పీలుస్తుంది.
ఇలా భారత రచనాకాలం నాటికే వృక్షాలకు ప్రాణం వుంటుందనీ, అన్ని జీవులలాగానే అవి కూడా స్పర్శజ్ఞానం, శబ్దజ్ఞానం,వాసన, రుచి వంటి అనుభవాలను గ్రహించగలవని తెలుపబడింది.
అ అలా ఉండగా జ్యోతిష శాస్త్రంలో అనేక అధ్యాయాలు వ్యవసాయానికి కేటాయించబడ్డాయి. కొత్త నాగలి కట్టడానికి, కోడెను కాడికలవడానికి, బావి తవ్వటానికి, ఉత్తనాలు చల్లటానికి, కొత్త పంట కొయ్యటానికి ఇట్లా అన్నిటికీ మంచిరోజులు చూడటం జ్యోతిష్యంలో వుంది.
ఏ పేరు ఏ నక్షత్రాలలో వెయ్యాలి, ఏ యేడు ఏయే పంటలు బాగా పండే అవకాశం వుంది అనే అంశాలు సిద్ధాంతి చెప్పాల్సిందే!
వర్షపాతం వివరాలు తెలిపే అంశాలు, ధరవరలు పెరిగే అంశాలు జ్యోతిశాస్త్రంలో పుష్కలంగా వున్నాయి.
ఇది కాక వృక్షాయుర్వేదము అనే ప్రత్యేక శాస్త్రం కూడా వుంది.
చిలకలు, మిడతల దండు వగైరాల ప్రస్తావన కూడా పరాశర సంహితలో వుంది.
మన ప్రాచీన వ్యవసాయ శాస్త్ర వారసత్వం వేదకాలం నుంచీ లభిస్తోంది. క్రీ.పూ.8000 నాటి ఋగ్వేదం నుండి లభిస్తున్న ఈ వ్యవసాయ శాస్త్ర విజ్ఞానం తరతరాలుగా అనేక క్రొత్త అంశాలను జోడించుకుంటూ అభివృద్ధి చెందింది.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని వ్యవసాయ శాస్ర్తియ విజ్ఞానం మనకు ప్రాచీన కాలంనుంచి వున్నది అనాటికి వేద మంత్రాలలో పుష్కలంగా దొరికే ఆధారాలే కాక, వ్యవసాయ శాస్త్ర గ్రంథాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఋగ్వేదంలోని అక్షసూక్తంలో వ్యవసాయ స్తుతి వుంది.
ఋగ్వేదంలో అన్న, ధన, ధాన్య, వాజి, వాజిని, అంధస్’ మొదలైన పదాలన్నీ వ్యవసాయక అభివృద్ధిని సూచిస్తాయి. ఋగ్వేదంలో కృషిసూక్తంలో వాడిన ‘సునాసీర’ ప్రస్తుతినిబట్టి (సునా=సంతోషం, సీర=నాగలి) ఆనాటికే నాగలి వాడుకలో వున్నట్లు తెలుస్తోంది. తాళ్ళతో నాగలిని, ఎద్దులు, రైతు కూలీల ప్రస్తావనవుంది. ఋగ్వేదం, తాళ్ళతో నాగలిని, ఎద్దులు మూపులమీద కాడిని వెసులుబాటుగా నేర్పుగా కట్టడాన్ని ప్రస్తావిస్తోంది. కళ్లం (ఖల) తూర్పారబట్టడం కూడా పదవ మండలం ఋగ్వేదంలో వుంది. ఋగ్వేదంలోనే ధాన్యాన్ని ఎడ్లబళ్ళమీద ఇంటికి తీసుకొచ్చి గాదెలలో నిలవ వుంచటం ప్రస్తావించబడి వుంది. పంట పొలాలు కొలవటం కూడా ఋగ్వేదంలో వుంది.
***
ఇక యజుర్వేదంలో కూడా అనేక ప్రస్తావనలున్నాయి. మైత్రాయణీయ సంహితలో అనేకం వున్నాయి. ‘‘బీజీ’’(విత్తనం) నిపుణులైన వ్యవసాయదారులు, దృఢమైన నాగలి వగైరా పదాల వినియోగమే కాకుండా, నెయ్యి, తేనెలను నాగేటి చాలులో కుమ్మరించే ప్రక్రియ కూడా అక్కడ చెప్పబడి వుంది.
తైత్తిరీయ సంహితలో వెదురుతో చేసిన ‘‘పరశు’’అనే (గంప లాంటిది) కొలతపాత్ర ప్రస్తావన వుంది. నాగలిని నిర్వహించటంకోసం ఆరు లేక పనె్నండు ఎద్దుల దాకా రైతులు పోషించుకునే విషయం కూడా అక్కడ ప్రస్తావించబడి వుంది.
అథర్వణవేదంలో కూడా ‘‘కృషి’’కి చెందిన అనేక ప్రస్తావనలున్నాయి. నాగలి కర్రు (అధర్వ- నినిని4.3) కొరడా లేక చెరణాకోల వంటి సాధనాల ప్రస్తావనలున్నాయి,.
అథర్వణ 12-1-1 సూక్తాలలో దాదాపు 63 మంత్రాలున్నాయి. జంతువులు, పక్షులు, ఇతర జీవులతో భూమినీ దాని వనరులనూ పంచుకునే ప్రస్తావన వుంది. వివిధ రంగుల నేలలు, దున్నిన నేలలూ, నివాసయోగ్యమైన నేలలు, భిన్న భిన్న మతాలు భాషలకు చెందిన వివిధ జాతుల గురించిన ప్రస్తావన వుంది.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి