Others

ఛాయా చిత్రం యోగ్యతా పత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అనంత రత్నాలు’- ఖండకావ్యం
రచయిత: వి.చంద్రశేఖర శాస్ర్తీ
పుటలు: 124; వెల: రూ.70/-
ప్రచురణ:
వసంత ప్రచురణలు, అనంతపురం
ప్రతులకు:
విశాలాంధ్ర మరియు నవ చేతన వారి
అన్ని శాఖల పుస్తక విక్రయశాలలు
వి.వైదుషి, 1-2-920-2, ఫ్లాట్ నం.24,
సోమనాథనగర్, అనంతపురం - 515004.
*
పరమ కవిత్వమందు ప్రతి బాలుడు బమ్మెర పోతరాజె;
సుందర తర గానమందు ప్రతి తమ్ముడు తానొక త్యాగరాజె;
సత్వర వరదానమందు ప్రతివాడును అచ్చపు భోజరాజె;
నేడరయ నవాంధ్రమందు ప్రజలందఱు రాజులె, రాజతేజులే’
- అంటూ 1950వ దశకంలో బోయి భీమన్న తన తెనుగు ప్రజాత్మానుభూతిపరంగా రాసిన పద్యపు చివరి పాదాన్ని ‘నేడరయ ‘అనంత’యందు జనులందఱు సంస్కృతి కాంతిమంతులే’ అని స్వల్పంగా తన భావనలు మార్చుకుంటూ అనంతపురం జిల్లా మహనీయుల గురించి వి.చంద్రశేఖరశాస్ర్తీ ‘అనంత రత్నాలు’ అనే ఒక ఖండ కావ్యం రాశారని అనుకోవచ్చు.
అనంతపురం జిల్లాకు చెందిన 135 మంది ప్రఖ్యాత వ్యక్తుల గురించి 135 తేటగీతులతో, తేట తెలుగు నీటు గోటులతో, ఒక ప్రశంసా పూర్వక భావనతో, గౌరవ పూర్వక సంభావనతో ఈ పద్యకావ్యం రూపొందింది. రచయిత దీనిని బాల సాహిత్యం అని పేర్కొన్నా ఇది ఎదిగినవారు గూడా చదవదగిన పుస్తకం.
ఇందులో అనంతపురం జిల్లాకు చెందిన తిరుమల రామచంద్ర, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బళ్ళారి రాఘవ, విద్వాన్ విశ్వం, తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, వేమన, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, పైడి లక్ష్మయ్య, చెట్టు ఇస్మాయిల్, అంకె మారెప్ప, వినె్సంట్ ఫెర్రర్, కే.వీ.రెడ్డి మొదలైన దిగ్దంతుల వంటి వాళ్ళ గుఱించే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, బుచ్చిబాబు, ఎన్.టి.ఆర్. మున్నగు మహాశయుల గూర్చి కూడా వారివారి విశిష్టతలను ప్రస్తుతిస్తూ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పద్యం ఒక్కొక్క వెలుగుచుక్క లాగా రాశారు శాస్ర్తీగారు.
పైడి లక్ష్మయ్యగారి గురించి రాస్తూ ‘‘పైడి లక్ష్మయ్య పసగల పైడికొండ’’ అన్నారు. కొండ అంటే చెక్కుచెదరని ఒక మహాస్థాణు రూపం. అదీను బంగారపు ముద్ద రూపంలో ఉంది. ఇది భావపరంగా ఉదాత్తాలంకారం. పైడి లక్ష్మయ్య పైడికొండ అనటంలో పరికర, ముద్రాలంకారాలు కూడా మెఱుస్తున్నాయి. సార్థక వంశనామధేయుడు అనే అర్థం ఇవ్వకనే ఇస్తున్నాడు కవి. లక్ష్మయ్య పైడికొండ అనటం అభేద రూపకాలంకారం కూడా.
‘అల్లె పద్యములను లేసు లల్లినట్లు’ అంటూ చెట్టు ఇస్మాయిల్ గురించి రాసిన పంక్తిలో ఉపమాన ఉపమేయ సమానధర్మాలు భావ సౌందర్య సంభరితాలై, కవితాహ్లాదాన్ని ఇస్తున్నాయి.
వినె్సంట్ ఫెర్రర్‌ను ‘రోగులకు ప్రాణ దీపవౌ రూపువాడు’ అనటంలోని అభివ్యక్తి మనోహరం. జీవన్మరణ సమస్యాంధకారంలో మ్రగ్గే రోగులకు ప్రాణము అనే ప్రభను చూపించే దీపంలాంటి రూపరి అనే భావం భవ్యంగా ఉంది. ‘‘పిల్లలకు జ్ఞాన దీపమై, ‘‘చెల్లువాడు’’ అనటంలోని తెలుగు నుడికారం, భావపర కాకువు, ప్రాసంగిక పదాలలోని విశిష్టార్థపు లోతులు తళుక్కుమంటున్నాయి.
‘‘ముఖ్యమంత్రిచ్చు ధృవపత్రమును నిరాక/రించె; పరభాషలోనున్న దంచుకనలి/ అంకె మారెప్ప ఆంధ్ర భాషాభిమాని’’అంటూ మారెప్ప గూర్చి రాసిన పద్యం మాతృభాష విషయంలో ఉండాల్సిన నిసర్గ ప్రేమను ఉద్దేశిస్తూ స్ఫూర్తిదాయకంగాను, సందేశాత్మకంగాను ఉంది.
కే.సుబ్బరామప్పగారు తెలుగు కన్నడాలకు సంయుక్త లిపిని తయారుచేశారు వంటి కొన్ని చారిత్రకాంశాలు చెప్పటం బాగుంది అక్కడక్కడ.
రచనంతా లాక్షణికంగా ఒక సూత్రబద్ధపు బిగువున పోహళిస్తూనే ‘హస్తినలొ’ అంటూ షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని హ్రస్వాంతంగా రాయటం, 37వ పద్యంలో ‘కరువు’ అంటూ లఘు రేషుయుతంగా రాయటం (కరువు అంటే క్షామం అనే అర్థం లేదు, కఱువు అనాలి. కరువు అంటే, అర్థం వేఱే) 23వ పద్యంలో చేశారు. వ్యావహారిక భాషా క్రియారూపం ఎన్నుకోవటం- ఇలాటివి కవియొక్క విశృంఖలతా ధోరణిని తెలియజేస్తున్నాయి. ఏతావాతా చెప్పాలంటే ఈ ‘అనంత రత్నాలు’ పద్య ఖండకావ్యం అనంతపుర ప్రాంత సాంస్కృతిక విశేష ఛాయాచిత్రం. ఆ జిల్లాకు ఒక యోగ్యతా పత్రం.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం