Others

ఎప్పుడో ఎక్కడో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో ఎక్కడో
ఒక సంఘటన కలచివేసినప్పుడో
ఒక దృశ్యం కదలనీయకుండా నిలబెట్టినపుడో
సమూహంలో ఈదుతూ తలమునకలైనపుడో
ఒంటరితనంలోకి నడచి వెళ్లినపుడో
మదిలో ఒక చినుకులా
మొదట మెల్లగా కురిసిన అలజడి
ఆనక తుపానులా రూపాంతరం చెందుతుంది
రెప్పల రెక్కల మాటున
ఏవో రంగులు తరలిపోతూ
వాటి గురించిన కలపోతలోకి నెట్టేస్తుంటాయ
అంతరంతరాలలో అస్పష్ట రూపమేదో కదలాడుతూ
పసిపాపలా పట్టుబడకుండా
వెనకెనుకే పరుగులు పెట్టిస్తుంటుంది
అలా ఉక్కిరిబిక్కిరై గిలగిలలాడుతుంటే
గుండెచప్పుడులో హఠాత్తుగా
అక్షర బీజానికి అంకురార్పణ జరుగుతుంది
హృదయాన్నంతా కూడగట్టుకుని
పదాలుగా పేర్చి
వాక్యాల దొంతరలను భావాలతో
కలగలిపి గుచ్చెత్తుతూ మూటగట్టుకుంటే
కవిత్వం మునివేళ్లపై
నెమలిలా పురివిప్పి నాట్యమాడుతుంది
అలా ఒక ఉవ్వెత్తున లేచిన అలలా
ఎప్పుడో ఎక్కడో ఒక కవిత
హఠాత్తుగా సీతాకోకై అరచేతిలో వాలుతూ
మనసును తేటపరచి
పరిమళభరితం చేస్తుంది

- పద్మావతి రాంభక్త, 9966307777