Others

తొలి సాధనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగరికత ఎంతగా మారినా!
నాగలి లేనిదే బతుకు గడవదు
రైతు లేనిదే పూట గడవదు
కోట్లాది ప్రజల ఆకలి బాధలు తీరాలంటే
వ్యవసాయ రంగం పచ్చగా ఉండాలి
దిగుబడులు పెరగాలి
అదే ఏరువాకకు తొలి సాధనం
- కృషి పున్నమి హలన్నమి
జ్యేష్ఠ నక్షత్రం రక్త వర్ణంతో
మూడు నక్షత్రాలతో నాగలి ఆకారం
ఏరువాక
- బ్రాహ్మణులకు మంత్రజపమే యజ్ఞం
రైతులకు నాగలితో పొలం దున్నడమే యజ్ఞం
పశుపాలకులు
పశువులను మేతకు తోలుకెళ్ళడం యజ్ఞం
పవిత్రంగా చేసే ఏ పనైనా యజ్ఞమే!
- వర్షం కర్షకులకు హర్షం
నీటితో ముడిపడి ఉంది వ్యవసాయం
తడి తగలనిదే మడి పండదు
నీరు పంటలకు, జీవులకు ప్రాణం
-ఉద్వృషభ యజ్ఞం అని ఉత్తర భారతంలో అన్నా
కారునీ పబ్బం- అని కర్నాటకలో అన్నా
వప్ప మంగల దివసం అని ప్రాచీన కాలంలో అన్నా
మేపాప్ అని ఐరోపాలో అన్నా
వేరేదైన జ్యేష్ఠ పౌర్ణమినాడు జరిగేది ఏరువాక
- శ్రీకృష్ణదేవరాయలు కానుకలిస్తే
శుద్ధ్ధోనుడు బంగారు నాగళ్ళను పంచాడు
హాలుని గాధాసప్తశతిలో ఉన్నది ఏరువాక
- నేటి తొలకరి చినుకే
రేపటి పంట సిరికి నీటి బాట
సీతే నాగేటి సాలు హలకర్మ
మేదినీ ఉత్సవం వృషభ సౌభాగ్యమే
రైతు సౌభాగ్యం
- పంట చేతికివచ్చిన తరువాత
సంబురంగా జరుపుకునే పండుగ సంక్రాంతి
బంగారు పంటలు పండాలని
వానదేవుణ్ణి, నేల తల్లిని వేడుకొనేది ఏరువాక
తెలుగు రాష్ట్రాలు స్వాగతించటం
సంతోషం ఏరువాకకు

-ఉషశ్రీ తాల్క