Others

నిమ్మతో లాభాలెన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనె్నన్ని ఫేస్ క్రీములు, ఫేస్ వాష్‌లున్నా సరే ముఖ నిగారింపు యత్నం సాగుతూనే ఉంటుంది. పైగా ఈమధ్య వాయు, జల కాలుష్యాలు ఎక్కువ అయిపోయాయి. దానితో బయటకు వెళ్లి వచ్చేసరికి ముఖం అంతా నల్లని ధూళి దానివల్ల చిన్న కురుపులు, తలలో చుండ్రు, మెడ, చేతులు ఎండ వల్ల కమిలిపోయి చర్మం రంగు నలుపుకు మారుతుంటుంది.
ఎండలోకి వెళ్లినా కూడా చర్మసౌందర్యం పాడవకుండా ఉండాలంటే నిమ్మకాయనే మంచి ఉపాయకారి అని నిపుణులు అంటున్నారు.
నిమ్మరసాన్ని ప్రతిరోజు ముఖానికి పట్టించి 20 నిముషాలుంచి కడిగేసుకుంటే ముఖం కాంతివంతం అవుతుంది. దుమ్ము, ధూళి వల్ల ఏర్పడిన నలుపురంగు దూరమవుతుంది.
చేతులకు, మెడ భాగంలో కూడా ఈ నిమ్మరసాన్ని పూసుకొన్నట్లు అయితే ఎండ వల్ల కమిలిన నలుపురంగు పోయ చర్మం తెల్లగా మారుతుంది.
నిమ్మరసాన్ని తీసివేసిన తరువాత మిగిలే నిమ్మచెక్కలను ఎండబెట్టుకోవాలి. సున్నిపిండిలో ఈ ఎండిన నిమ్మచెక్కలను పొడి చేసి కలుపుకున్న సున్నిపిండిని స్నానానికి వాడుకుంటే శరీర దుర్గంధం పోతుంది. చర్మం పొడిబారకుండా నునుపుగా, కాంతివంతంగా కూడా ఉంటుంది.
నిమ్మరసాన్ని బాహుమూలాల్లో రుద్దితే చెమట వల్ల వచ్చే వాసనను అరికట్టవచ్చు.
బేకింగ్‌సోడాలో కాస్త నిమ్మరసం జోడించి దీన్ని శరీరంలో చెమట పట్టే చోట పూసి పదినిముషాల తర్వాత కడిగేసుకుంటే లేదా స్నానానికి ముందు పూసుకొని స్నానం చేస్తే కూడా చెమట వల్ల వచ్చే దుర్గంధం మాయమవుతుంది. నిమ్మరసం రెండు చెంచాలు, ఒక చెంచా తేనె ను ఒక గ్లాసు వేడినీళ్లల్లో కలిపి ప్రతిరోజు పరగడుపున తీసుకొంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరం చురుకుగా ఉంటుంది. *