Others

ప్రధానం గుణమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మనా జాయతే శూద్రాః కర్మణా జాయతే ద్విజః అని స్మృతి. పుట్టకతో అందరూ శూద్రులే. నియమనిష్టలతో భోగత్యాగాలు చేసి వేదాధ్యయనము చేయుచూ లౌకిక విషయాసక్తులు కాని వారు ద్విజత్వమును పొందుదురు. బ్రహ్మజ్ఞానము గల ఈ ద్విజలు మిగిలిన వర్ణముల వారికి దిశానిర్దేశము చేయగలరు.
సత్వగుణ ప్రధానుడైన బ్రహ్మజ్ఞాని సకల శాస్త్రాలను సృజించగల శక్తిగలవాడై మానవ సమాజము సుఖసంతోషాలతో మనుగడ సాగించుటకు తగిన ప్రణాళిక వేయగలడు.
గుణములను బట్టి తాము చేపట్టే కర్మలను అనుసరించి నాలుగు వర్ణములుగా మానవులు విభజింపబడ్డారు. త్రిగుణముల ఆధారముగా సత్యప్రధానమైన శమము, దమము, తపము ఎవరైతే అనుసరిస్తారో వారు బ్రహ్మజ్ఞానులు. రజోగుణ ప్రధానమైన శౌర్యమును అనుసరించువారు క్షత్రియులు. తేజమును అనుసరించువారు వైశ్యులు. తమోగుణప్రధానమైన సేవాభావము గలవారు శూద్రులు. కొంతమంది స్వార్థపరులు ఈ వర్ణములను కులముగా మార్చి సమాజమును భ్రష్టుపట్టిస్తున్నారు. మానవుడనేవాడు ఎవడైనా ఆయా గుణములను సాధనచేసి తదనుగుణవర్ణములలో ప్రవేశించవచ్చు. అశక్తుడయినచో ఆ వర్ణమునుండి నిష్క్రమించవచ్చు. అంతియే గాని పుట్టుకతోనే వర్ణము నిర్దారించబడదు. స్ర్తిపురుష సంయోగమే మరొక జన్మకు కారణము తప్పకులము కాదు. చరిత్రలో రాజ్యములేలిన రాజులందరూ క్షత్రియ కులము వారు కాదు. క్షాత్రగుణమును బట్టి రాజులయినారు. వేదాదులను అధ్యయనము చేసిన బోయలు బ్రహ్మజ్ఞానులైనారు. పరమ నైష్టికుడైన కౌశికునకు ధర్మవ్యాధుడు ధర్మబోధ చేసి బ్రహ్మజ్ఞాని అయినాడు. కావున చక్కని సమాజమునకు వర్ణాశ్రమధర్మములు ఎంతో ముఖ్యములు. వీటికంటే సర్వజనీనము, సర్వజనసమ్మతము అయిన ధర్మాచరణ ఎంతో ముఖ్యం. అదియే మన భరతజాతికిశ్రీరామ రక్ష. అందుకే నేటి కలియుగంలోనూ ఎవరి గుణాన్ని బట్టి వారు పనులు చేసుకోవచ్చు. ఆ పనులే వారి భవితవ్యాన్ని నిర్ణయస్తాయ. నోటితో మంచిమాటలు చెబుతూ చేత్తో చెడు పనులు చేస్తే భగవంతుడు రెండింటికీ ఫలితాన్నిస్తాడు. ఎవరైనా కర్మ చేస్తే ఫలితం అనుభవించక తప్పదు. వేదవ్యాసుడేనాడో మంచిచేసిన వారికి సుకృతాలు చెడు చేసినవారికి శిక్షలు తప్పవు అని చెప్పారు. ఈ విషయాన్ని మనసునుంచుకుని పనులు చేసుకుంటూ పోతే చాలు యోగక్షేమాలను విచారించే ఆ పరంధాముడే ఫలితాలనిస్తాడు. దీనికోసం కక్షలు కార్పణ్యాలు, కొట్లాటలక్కర్లేదు.

వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు