Others

‘ప్లానింగ్’ ఉంటే ఎంతో హాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరే ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. అసలు టైమ్ లేదండీ తినడానికి పడుకోవడానికి అంటారు. మరికొందరు పని ఒత్తిడితో సతమతమై పోతున్నాం. ఇల్లు వాకిలి పట్టించుకోలేకపోతున్నాం అంటున్నారు. ఇట్లా ఇబ్బందులు పడేవాళ్లల్లో స్ర్తిలు ఎక్కువగా ఉన్నారు. అటువంటివారు కొన్ని నియమాలు పాటిస్తే అటు ఇంటిని ఇటు ఆఫీసును చక్కగా నిర్వర్తించగలగుతారు. కొన్ని నియంత్రణలు చేసుకొంటే సదా సంతోషంతో అనుకొన్నవీ చేయగలుగుతారు. వాటిని ఒక్కసారి చూద్దాం.
ఏ పనికైనా ముందస్తు ప్రణాళిక అవసరం. కొందరు అప్పటికప్పుడు అనుకుని చేసేసా అంటుంటారు. ఇది పైకి చెప్పే గొప్పేకాని ప్రతి పనిని కూడా మెదడు ఆలోచిస్తునే ఉంటుంది. కనుక చేయబోయే పనిని గూర్చి ముందుగా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం చేద్దాం అని ప్రణాళిక వేసుకొంటే చాలు ఆ పనిలో నైపుణ్యం వద్దన్నా కనబడుతుంది. దానితో పాటు ఆ పని చేయడానికి పట్టే సమయాన్ని కూడా క్యాలుక్కులేట్ చేసుకోగలగాలి. ఆ సమయంలోనే దాన్ని పూర్తి చేయాలి. అంతేకాని సగం ఇప్పుడు చేద్దాం. ఆ తరువాత మళ్లీ ఇంకోసారి చేద్దాం అంటే పనిలో నేర్పు కొరవడుతుంది. ఒక్క ఆలోచనతో ఏకాగ్రతతో పనిచేస్తే ఆ పని అనుకొన్న టైములో పూర్తి కావడంతోపాటు బాగుంది అన్న ప్రశంసను పొందుతుంది.
- చేయాలనుకొన్న పనులు, అవసరమైన పనులు అన్నింటినీ వరుసగా రాసుకోవాలి.
-వాటిల్లో ఏవి ముందు చేయాలోకూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
-అతిముఖ్యమైన పనులు ముందు, తర్వాత ఇష్టమైనవి, ప్రాధాన్యత క్రమంలో రాసుకోవాలి. రాసుకొన్న విధానంగానే చేయాలి. - ఒకే సమయంలో మూడు నాలుగు పనులు మొదలుపెట్టవద్దు. ఒక దాని తర్వాత ఒకటి చేస్తే కలగాపులగం కాకుండా ఉంటాయి.
- ఇంటిని క్రమపద్ధతిలో సర్దుకున్నట్టుగానే చేయాల్సిన పనులు, వాటికి కావాల్సిన సరంజామా అన్నీ ముందుగానే సర్దుకోవాలి. -కాలం చాలా విలువైనది. కరిగిపోయినా కాలం తిరిగి రాదు కనుక ఎక్కడా వేస్టు చేయకుండా చేయాల్సిన పనులకు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి.
- పని ఎవరి బలవంతం మీదనో చేయకండి. పని పట్ల ఇష్టాన్ని పెంచుకుని చేస్తే మనసుకు తృప్తి ఆనందం కలుగుతాయి. కష్టమైన పని యైనా ఇష్టంగా చేస్తే అది ఎంతో తృప్తిని, సంతోషాన్ని కూడా ఇస్తుంది.
-రోజంతా పని మాత్రమే చేయకుండా కాసేపువిశ్రాంతి తీసుకోవాలి. అందులోను మీకిష్టమైన పాటలు వినడమో, సినిమా చూడడమో లేక ఇంకేదైనా ఇష్టమైనవి ఉంటే వాటిని తప్పనిసరిగా చేయాలి. అపుడే చేయాల్సిన పనులను మరింత బాగా చేయడానికి శరీరం, మెదడు కూడా పనిచేస్తుంది.
- ఇంట్లో ఉన్న ఇబ్బందులను గురించి ఆఫీసులో కొలిగ్స్‌తో మాట్లాడకండి. కొలిగ్స్‌తో ఎంతో స్నేహంగా ఉండవచ్చు కానీ ఇంట్లో విషయాలు మాత్రం చెప్పకూడదు. - ఇంట్లో చేయాల్సిన పనులను ఆఫీసులో ఆలోచించకండి. అట్లానే ఆఫీసు విషయాలను అస్తమానం ఇంట్లోవారితో చెప్పివిసిగించకూడదు. ఇంట్లో ఆఫీసు పనులను గూర్చి ఆలోచిస్తూ అక్కడ పనులు చెడగొట్టకోకూడదు.
ఎక్కడ ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలో బద్దకించకుండా చేసేస్తే చాలు. పని సులువుగా అయిపోతుంది. మనసు ఆహ్లాదాన్ని పొందుతుంది.
- ఇంట్లో పిల్లలతో గడపాల్సిన టైమును తప్పకుండా వారికే కేటాయించండి. అపుడు మాత్రమే మీరు మంచి అమ్మనో నాన్న నో అవుతారు. లేకపోతే మమ్ములను మా పేరెంట్స్ పట్టించుకోరు అన్న అభిప్రాయానికి పిల్లలు వచ్చేస్తారు.
అట్లానే ఇంట్లో ఉన్న పెద్దలతో కూడా రోజులో కాసేపు అయినా వారితో ముచ్చట్లు చెప్పాలి. ఆఫీసులో జరిగిన విషయాలో, లేక మీకు ఆశ్చర్యం కలిగించినవో, ప్రయాణంలో మీరుచూసిన వింతలో విశేషాలలో, లేదా ఇంటికి కావాల్సిన సరుకుల గురించో ఏవో ఒక మాటలు కాసేపు వారితో పంచుకుంటే మీ మనసుకు రిలాక్స్ వస్తుంది. ఆ పెద్దవారికి మాతో మాట్లాడారన్న సంతృప్తినిచ్చినవాళ్లు అవుతారు.
చూశారా ఇనె్నన్ని లాభాలో అందుకే ఏపనికైనాప్రణాళికతో రండి. విజయాన్ని సాధించండి.

- మాగంటి రాధిక