Others

ఆత్మయే పరబ్రహ్మం -- పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
7-8-51,ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
--------------------------

కామరహితుడు, శోకరహితుడైన వాడు ఇంద్రియాల యొక్క మనస్సు యొక్క పవిత్రత ద్వారా, ఆత్మ యొక్క మహిమను సాక్షాత్కరించుకుంటాడు.
పరమాత్మయు, జీవాత్మయు శరీరమను ఒకే వృక్షమున, జీవుని యొక్క ఒకే హృదయమున స్థితి పొందియున్నవి అని భావము.
‘న జాయతే మ్రియతే, నాకదాచిన్, నాయం భూత్వా, భవితా, నానభూయః
అజోనిత్యః శాశ్వతో యం, పురాణోనహన్యతే, హన్యమానే శరీరే
భ.గీ.అ. 2-20
భావము: ఆత్మకెన్నడును జనన మరణములు లేవు. ఆత్మ ఒకప్పుడుండి, ఇంకొకప్పుడు లేకపోవడం వుండదు. కావున ఆత్మ, అజము, నిత్యము, శాశ్వతము, పురాతనము దేహము మరణించినను ఆత్మకు మరణము లేదు.
వేదావినాశినం నిత్యం య ఏనమజమన్యయమ్
కథం స పురుషః పార్థా కం ఘాతయతి హన్తికమ్
భ.గీ.అ. 2-21
భావము: పార్థా! ఆత్మనాశనము లేనిది, శాశ్వతమైనది, అజము =అనగా పుట్టుక లేనిదియు, అక్షయమును అని తెలిసికొనిన వ్యక్తి, చంపుట, చంపించుట, ఎట్లు చేయును.
శ్లో వాసాంసి జీర్ణాని యథావిహాయ, నవాని గృహ్ణాతి, నరో పరాణి
తథా శరీరాణి విహాయ, జీర్ణాన్యన్యాని సంయాతి నవానిదేహి
భ.గీ.అ.2-22

భావం: మనిషి పాత దుస్తులు విడిచి కొత్తవి ధరించునట్లు, ఆత్మ కూడా శిథిలమైన, నిప్ప్రయోజనములైన శరీరములనొదలి వేసి, కొత్త శరీరములను ధరించును. జీవాత్మ వరొక నూతన శరీరమును పొందుట పరమాత్మయొక్క అనుగ్రహముచే సంభవమగుచున్నది.
సృష్టిలోని ప్రతి ప్రాణిని శ్రోత్రము (చెవి), త్వక్కు (చర్మము), చక్షుస్సు, జిహ్వ, ఘ్రాణము అను పంచ జ్ఞానేంద్రిములు కలవని మనకు తెలుసు. వీని సహాయము చేత ఆయా విషయములగు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను మనము గ్రహించుచున్నాము. ప్రపంచమందలి సకల వస్తుజాలము రుూ పంచేంద్రియము లందిమిడియున్నది. ఆ విధముగా జ్ఞానేంద్రియముల ద్వారా దృశ్యమాన జగత్తును గ్రహించు జ్ఞానశక్తియే ‘సంవత్తనియు(కాన్సియస్‌నెస్) లేక ఆత్మయనబడుచున్నది. కాని సంవిత్తు విషయజ్ఞానము (పర్‌సెప్ట్స్) తద్విషయములు (ఆబ్జెక్ట్స్) అను మూడును వేరువేరుగా కనబడుచున్నవి. అదియెట్లనిన, సంవిత్తు (ఆత్మ)జాగ్రదవస్తయందు ప్రాపంచిన విషయములను జ్ఞానేంద్రియముల సహాయమున గ్రహించుచున్నది. అట్టి విషయములు లేనపుడు (నిద్రయందు) కూడా సంవిత్తు ప్రకాశించుచున్నది. జాగ్రదవస్థయందలి విషయానుభవము స్వప్నమునందు వాసనా రూపమున సంవిత్తుచే గ్రహింపబడుచున్నది. అంటే సుషుప్తి యందు కూడా జ్ఞానేంద్రియ విషయజ్ఞానమును, రుూ మూడు అవస్థలయందు సంవిత్తు ప్రకాశించుచునేయున్నది. ఉదాహరణకు దీపమున్నచోట వస్తు సంచయమున్నచో అవి ప్రకాశమున పొందుచున్నవి. ఎట్టి వస్తు సంచయము లేకున్నను దీపము ప్రకాశించుచునే యున్నది. జాగ్రదవస్థయందు విషయములు గలవు. స్వప్నావస్తయందు విషయములు లేకున్నను తద్వసనలు మాత్రమే కలవు. సుషుప్తియందు విషయములుకాని, విషయ వాసనలు కాని లేవు. కాని సంవిత్తు ప్రకాశించుచునే యున్నది. అనగా కాలత్రయమునందు మార్పులేనిది కావున సంవిత్తు నిత్యము, సత్యమైయున్నది. అట్టిది ఆత్మయనబడును.
జాగ్రత్, స్వప్న సుషుప్తులు మూడునొకేసారి కలుగవు అని మనకు తెలుసు. ఆత్మ (సంవిత్తు) మాత్రమీ మూడు స్థితులయందును వర్తించున్నది. ఈ విధమైన లౌకికానుభవముచే, నిత్యజ్ఞానానంద స్వరూపమని తెలియబడుచున్న ‘ఆత్మ’యే వేదాంత పరిభాషయందు పరబ్రహ్మముగా చెప్పబడుచున్నది. ఆత్మ - బ్రహ్మల యొక్క ఐక్యార్థమే ‘అయమాత్మాబ్రహ్మ’ అను మహావాక్యముచే వ్యక్తమగుచున్నది. శ్రీ విద్యారణ్యులవారి వేదాంత పంచదశియందు కూడా బ్రహ్మాత్వైక తత్వమును చాలా స్పష్టముగా ‘బ్రహ్మసత్యంజగన్మిధ్య’ అను అద్వైత సిద్ధాంతము బహు విపులముగా చెప్పబడినది. నిరంతర పరివర్తనశీలమైన నామరూపాత్మకమైన జగత్తు అసత్యము, అనిత్యము, అచేతనము, దుఃఖాభాజమనియు, అద్వితీయమగు సత్ పదార్థము నిత్యము, సత్యమనియు, ఇట్టి ‘సత్’ పదార్థము మన శరీరమందలి పంచకోశము (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశము)లకు సంబంధించినపుడు ఆత్మ లేక ప్రత్యగాత్మగాను, జగత్తునకు సంబంధించినపుడు ‘పరబ్రహ్మగాను చెప్పబడుచున్నది. బ్రహ్మత్మలకనన్యము పాటించి పరమాత్మయనియు తెలియబడుచున్నది. లోక వ్యవహారములో ఇంకొక మాట కలదు. అది జీవుడు అనుమాట, పరమార్థ దృష్టితో చూసినచో, జీవుడు ప్రత్యగాత్మయేకాని తదన్యుడు కాడు. ఇచ్చట తెలియదగిన విషయమేమనగా స్వయం ప్రకాశశక్తిగల సంవిత్ (ఆత్మ)వల్లనే సకల జగత్తు ప్రకాశించున్నది. ఈ విషయము కఠోపనిషత్తు నందు ‘తస్యభాస సర్వమిదం విభాతి’ అని చెప్పబడినది. జీవాత్మయు, పరమాత్మయు, ఒకే వృక్షము మీదనున్న మిత్రపక్షులవంటివని ముండకోపనిషత్తు, శే్వతాశ్వతరోపనిషత్తు తెలుపుచున్నవి. వీటిలో పరమాత్మ (రెండవ పక్షి) ఊరక తన మిత్రుని పరిశీలించుచుండును. అనగా జీవాత్మ భౌతిక ఫలములకై ఆకర్షితమగుచుండగా, రెండవ పక్షి (పరమాత్మ) సాక్షీభూతుడుగా చూచుచున్నాడు. ఫలములకు ఆకర్షితుడైన పక్షి (జీవాత్మ), ఒక వృక్షము (శరీరము) నుండి, మరియొక వృక్షము (శరీరము)నకు మారుచున్నాడు, మరియు ఫలభోక్తయగు పక్షి (జీవాత్మ) ఫలాపేక్ష కారణముచే, చింత, దుఃఖములయందుమగ్నమై యున్నాడు.
శ్లో నైనంఛిన్దన్తి శస్త్రాణి, నైనం దహతి పావకః
న చైవం క్లేదయంత్యాపో, నశోషయతి మారుతః
భ.గీ.అ.2-23
భావార్థం: ఆత్మను ఆయుధములు ముక్కలుగా ఖండింపలేవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఎండింపజాలదు. నిప్పురవ్వలు అగ్నితో సామనమైన గుణములు కలిగియున్నను, అగ్ని నుండి విడివడినపుడు వాని లక్షణములను కల్పోయినట్లు పరమాత్మ (్భగవంతుడు) యొక్క విభిన్నాంశములైన, జీవాత్మలు అతని (పరమాత్మ) సాంగత్యము విడనాడినచో మాయామోహితులగుట కవకాశమున్నది. జీవాత్మలన్నియును, పరమాత్మయొక్క అంశలేయని వరాహపురాణము కూడ అభివర్ణిచియున్నది. భగవద్గీత కూడా ఆత్మ శాశ్వతమని చెప్పుచున్నది.
శ్లో అచ్చేద్యో యమదాహ్యో - యమక్లేద్యో శోష్య ఏవచ
నిత్యః సర్వగతః స్థాణురచలో యం సనాతనః
భ.గీ.అ.2-24
భావార్థం: జీవాత్మ ఛేదించుటకుగాని, దహింపబడుటకుగాని, ఎండించుటకు గాని, కరిగించుటకుగని వీలుకానిది. అది నిత్యము, సత్యము, సర్వవ్యాపకము, మార్పులేనిది. జీవాత్మ యొక్క ఈ గుణములన్నియు అది పరమాత్మ లేక పరమ పురుషుని యొక్క శాశ్వతమైన అణు అంశములనియు, ఎట్టి మార్పును లేకుండ, శాశ్తముగా, అట్టి (జీవాత్మ) అణురూపముననే వుండుననియు తెలియుచున్నది.

--ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590