Others

ఎన్నికల నాదం.. ‘హోదా’ నినాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రత్యేక హోదా’ అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలూ 2019 ఎన్నికల నినాదంగా, తమ ఎజెండాగా మార్చేశాయి. ‘హోదా’ను సాధించే దిశగా కాకుండా, వోటుబ్యాంకు రాజకీయాలకు దీనిని వాడుకోవాలని యత్నించడం సబబు కాదు. ప్రత్యేక హోదా అంశం ఇపుడు నేతల ప్రసంగాలకే పరిమితమైంది. నిన్నటి వరకూ ‘హోదాను సాధించి తీరుతాం, ఢిల్లీని వణికించి తీరుతాం, మోదీ మెడలు వంచుతాం’ అంటూ రణ నినాదాలు చేసినవాళ్లు ఇపుడు పోరాటం ఊసే ఎత్తడం లేదు. ప్రత్యేక హోదాను ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని, హోదా రాకుండా అడ్డుపడ్డారని వైరి పార్టీలపై సెగలు కక్కిన వాళ్లు మెల్లగా అసలు విషయాన్ని పక్కన పెట్టేశారు. పరస్పరం రాజకీయంగా నిందలకు పెద్దపీట వేస్తున్నారు. మోదీ సహా కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్ వంటివారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తెగేసి చెప్పాక, అన్ని పార్టీలవారూ అయోమయంలోకి జారుకున్నారు. ఎలాంటి ఉద్యమాన్ని నిర్మించాలో, ఎలాంటి కార్యాచరణతో కేంద్రంపై యుద్ధం చేయాలో అర్థం కాని సంకటస్థితిలో నేతలున్నారు. హోదాపై వౌనంగా ఉంటే ప్రజల్లో పలచబడతామనే భయంతోనే విమర్శలు, ఆరోపణలకే నేతలు పరిమితమవుతున్నారు. భాజపా నాయకులైతే పోటీపడి మరీ కేంద్రానికి, మోదీకి భజన చేస్తున్నారు. ఇలా చేయడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. తెదేపా, వైకాపా, భాజపా, జనసేన, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రకటనలకు, సభలకు, విమర్శలకు పరిమితమైపోయి- కేవలం ఎన్నికల కోణంలోనే ఆలోచిస్తున్నాయి.
సీఎం చంద్రబాబు ‘్ధర్మపోరాట దీక్ష’లతో మోదీని బోనెక్కించాలని యత్నిస్తున్నారు. కేంద్రంలో ఏ ప్రభ్వుమైతే హోదా ఇస్తుందో, వారికే మద్దతిస్తామని గతంలో చెప్పిన వైకాపా అధినేత జగన్ ఆ మాటను పునశ్చరణ చేయటంలేదు. ఢిల్లీ వెళ్లి మోదీ ఇంటిముందు కూర్చుంటే హోదా ఎందుకురాదని అధికార, విపక్ష పార్టీల ఎంపీలను ప్రశ్నించిన జనసేన అధినేత పవన్‌కు ఢిల్లీ ప్రయాణం గుర్తుకురాదు. అశాస్ర్తియ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ- తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు- రేపు అధికారంలోకి రాగానే హోదాపై ‘ప్రధాని రాహుల్’ తొలి సంతకం పెడతారని నమ్మబలుకుతోంది. అయితే, ఇప్పుడు ఏం చేయాలో ఆ పార్టీకి దిక్కు తోచడం లేదు. ఇతర పక్షాల మద్దతుతో మోదీపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు.
హోదాను మించిన ప్యాకేజీ ఇస్తామనగానే గతంలో స్వాగతించిన తెదేపా ఇప్పుడు ‘హోదా’ కావాలంటోంది. దాన్ని సాధించే మార్గాలను మాత్రం అనే్వషించడం లేదు. విపక్ష పార్టీలు ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోదీ కించిత్తు తగ్గలేదు. పైగా పదునైన ఎదురుదాడి చేశారు. వామపక్ష పార్టీలు గల్లీలకే నిరసనలను, ధర్నాలను పరిమితం చేశాయి. ‘హోదా’ ఇస్తే రాయితీలు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయన్న వారు దాన్ని సాధించేందుకు గట్టిగా ఎందుకు మాట్లాడరు? తెలంగాణ ఉద్యమం తరహాలో ఎందుకు కలవరు?
ఢిల్లీని వణికించలేకపోయినా కనీసం ఎందుకు కదిలించరు? విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజలు ఉద్యమించాలని చెప్పేవారు- హోదా సాధనకు చేసే నిర్ణయాత్మక ఉద్యమం ఏమిటి? రాజ్యాంగ వ్యవస్థలను ఎందుకు కదిలించరు? రాష్ట్ర విభజనకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమని చెప్పక తప్పదు. విభజనతో ఏపీకి ఎదురైన నష్టాలకు, కష్టాలకు బాధ్యత వారిది కాదా? ఢిల్లీలో చేయాల్సిన పోరాటాలను ఏపీలోని గల్లీల్లో చేస్తే, కేంద్రానికి వచ్చిన తలనొప్పి ఏం ఉంటుంది? ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వ పాలనకు, ఆస్తులకు నష్టం కలిగిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? రాజకీయ పక్షాలే విభజన హామీలను, హోదాను సాధించాలే తప్ప, బలిదానాల వైపు యువతను నడిపించకూడదు. సీమాంధ్ర ప్రజలు కూడా హోదాపై, విభజన హామీలపై ద్రోహం చేసిన వారికి ఘోరీలు కట్టేందుకు సిద్ధం కావాలి. ఢిల్లీలో పోరాటం చేసేలా నేతలపై ఒత్తిడి పెంచాలే తప్ప, రాజకీయ పార్టీలు చెప్పినదానికల్లా చప్పట్లు కొట్టకూడదు.

-పోతుల బాలకోటయ్య 98497 92124