Others

దళితుల దారి ఎటు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికల రానున్నాయి. వివిధ సామాజిక వర్గాలు, పలు రాజకీయ పక్షాలు ఎన్నికలలో తమ వ్యూహాన్ని ఖరారు చేసుకోవడానికి అప్పుడే సమాయత్తమవుతున్నాయి. అణగారిన వర్గాలుగా ఉన్న దళితులు రాబోయే ఎన్నికల్లో ఏం చేయాలి?
మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఆంగ్లేయులు ‘కమ్యునల్ అవార్డు’ పేరిట ముస్లిములు, సిక్కులు, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు కల్పించారు. 1931లో అమలులోకి వచ్చిన ఈ బ్రిటీష్ చట్టం మేరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుడు నియోజకవర్గాలను నిర్ణయించారు. భారత రాజ్యాంగ సభలో సర్దార్ వల్లభభాయి పటేల్ నేతృత్వంలోని ఉప సంఘం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వరాదని, శతాబ్దాలుగా అస్పృశ్యతకు గురైన ఎస్సీలకు, సమాజ జీవనానికి దూరంగా ఉన్న ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. విస్తృత చర్చ తర్వాత ఈ ప్రతిపాదనను రాజ్యాంగ సభ ఆమోదించింది. ‘షెడ్యూల్డు కులాలు అంటే ఎవరు?’ అన్న విషయమై ఆనాడే స్పష్టత ఇచ్చారు. అయినా ఎస్‌సి, ఎస్‌టి పరిధిలోకి రాని ఇతర కులాలను ఈ జాబితాలో చేర్చే ప్రయత్నం జరుగుతోంది. దీనివల్ల నిజమైన ఎస్టీ, ఎస్టీలకు నష్టం కలుగుతోంది.
ఆర్థిక వెనుకబాటు కారణంగా షెడ్యూల్డు కులాలకు, తెగలకు రిజర్వేషన్లు కల్పించలేదు. స్వాతంత్య్రం లభించిన దశాబ్దాల తర్వాత కూడా ఆశించిన మేరకు అంటరానితనం, కులవివక్ష పోలేదు. ఎస్సీ, ఎస్టీల్లో కొద్దిమందికి ప్రగతిఫలాలు లభించినా ఇంకా ఎక్కువ మంది అభివృద్ధికి దూరంగానే ఉన్నారు. 1990లో వెనుకబడిన కులాలకు (బీసీలకు) రిజర్వేషన్లు కల్పించారు. సర్వోన్నత న్యాయస్థానం రిజర్వేషన్ల వ్యవస్థను సమర్థిస్తూనే 50 శాతం మించి రిజర్వేషన్లను ఇవ్వరాదని ఆదేశించింది. 50 శాతం మించి రిజర్వేషన్లు అమలవుతున్న పరిస్థితి తమిళనాడులో కొనసాగుతోంది. ఇంకా ఎంతకాలం షెడ్యూల్డు కులాలకు, తెగలకు రిజర్వేషన్ ఇవ్వాలి? వారికిచ్చే రిజర్వేషన్లను రద్దు చేయాలి లేదా ఇతర కులాలకు సైతం పేదరికం ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలి అనే డిమాండ్ వివిధ రాష్ట్రాలలో మళ్లీ మళ్లీ వినబడుతూనే వుంది.
మహారాష్టల్రో మరాఠాలు, హర్యానాలో జాట్‌లు, రాజస్థాన్‌లో గుజ్జర్లు, గుజరాత్‌లో పటేళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ ఉద్యమిస్తున్నారు. మహారాష్టల్రో అనాదిగా మరాఠీలు, హర్యానాలో జాట్‌లు అధికారం అనుభవిస్తున్నారు. అధికారం తమ హక్కుగా ఆ కులస్థులు భావిస్తున్నారు. కాలక్రమంలో హర్యానా, మహారాష్టల్ల్రో ఆ కులస్థులే కాక వేరే కులస్థులు ముఖ్యమంత్రులయ్యారు. దీనికి తట్టుకోలేని ఆయా కులాలవారు తమకు రిజర్వేషన్ కల్పించాలంటూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. అన్ని కులాలోనూ పేదవారున్నారు. వారి అభివృద్ధికి ఆలోచించాల్సిన అవసరం ఎంతో వుంది. 70 ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు పటేల్, మరాఠా, జాట్ తదితర కులాలకు రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగ స్ఫూర్తిమేరకు సాధ్యం కాదని తెలుసు. అయినప్పటికీ ముస్లింలకు మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ప్రత్యక రిజర్వేషన్లకు ఉద్యమిస్తున్న పటేల్ వర్గాన్ని కాంగ్రెస్ సమర్థిస్తోంది. సుదీర్ఘకాలం రాజకీయాలలో పనిచేసిన మహారాష్ట్ర నాయకుడు శరద్ పవార్ మరాఠా రిజర్వేషన్ల కోసం బహిరంగంగా మద్దతునిస్తున్నారు. రాజ్యాంగం మేరకు మరాఠాలకు రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదని ఆయనకు తెలియదా?
తాము అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని అంశాలపై రాజకీయ నేతలు కొన్ని కులాలను రెచ్చగొడుతూ ఉంటే- దళితులు ముందుచూపు లేకుండా వీరివెంట పరిగెత్తడమేనా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా బలహీనులు, ఎంతో కొంత సహాయం ఉంటే తప్ప నిలబడలేనివారు ఎవరు? తమ వద్ద సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రభుత్వాలను లొంగదీసుకుంటాం అని అహంకారం ప్రదర్శిస్తున్నవారు ఎవరన్నది దళితులు గుర్తించాల్సి ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన వర్గంగా ఉన్న మరాఠీలు, జాట్‌లు, పటేళ్ల వలే కాకుండా- ఆయా రాష్ట్రాలో దళితులు కులవివక్షకు, అణచివేతకు గురౌతున్నారన్న సంగతి వాస్తవం కాదా? పై కులాలలో కూడా సహృదయుల, నిమ్న వర్గాల ఉన్నతికి మనస్ఫూర్తిగా సహకరించేవారు, పేదవారు ఉన్నారన్న విషయం మనం బహిరంగంగా అంగీకరించాలి. డా బాబా సాహెబ్ అంబేడ్కర్ నిమ్న కులాల సమగ్ర ఉన్నతి, సామాజిక సమానత్వం కోసం ఉద్యమిస్తూనే అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు బంధుభావనతో మనమంతా ఒకటే అనే భావనతో ఉండాలని బలంగా భావించారు. అదే దిశలో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు.
తాము అధికారంలోకి రావడానికి వివిధ కులాల మధ్య చిచ్చును పెడుతున్నవారెవరు? నిజంగా నిమ్న వర్గాల ఉన్నతికి సహకరించేవారు ఎవరు? అనే విషయాలను దళితులు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదా? 70 సంవత్సరాల స్వాతంత్య్ర భారత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తమకు నిజమైన మిత్రులెవరు? అసలైన శత్రువులెవరు? అని దళితులు ఆలోచించి తమ కార్యాచరణను రూపొందించుకోవాలి.

-డా. కడియం రాజు 98481 62454