Others

విజయ్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరా అద్వానీ.. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరుగా మారింది. తెలుగులో చేసిన తొలి చిత్రమే సూపర్‌స్టార్ మహేష్‌తో చేయడం, అది కూడా అనూహ్యంగా సూపర్ డూపర్ హిట్ కావడంతో కైరాకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ రామ్‌చరణ్‌తో కలిసి బోయపాటి చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ, మొన్న ఒక బడా బాలీవుడ్ ఆఫర్ పట్టేసిన విషయం తెలిసిందే. బడా నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ త్వరలో నిర్మించబోయే భారీ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియపరిచింది. ఇక ప్రస్తుతం కైరాను మరొక బంపర్ ఆఫర్ వరించిందని వినికిడి. కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ సరసన నటించే చిత్రంలో అవకాశం సంపాదించింది ప్రస్తుతం విజయ్ మురగదాస్ దర్శకత్వంలో సర్కార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అట్లీ దర్శకత్వంలో ఏజిఎన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కించేబోయే చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్‌గా కైరాను సెలెక్ట్ చేసింది ఆ మూవీ టీమ్. ప్రస్తుతం రూమర్‌గా ప్రచారం అవుతున్న ఈ వార్త ఒకవేళ నిజమైతే కైరా అద్వానీ నక్కతోక తొక్కినట్లే మరి.