AADIVAVRAM - Others

మట్టివాసనకు కారణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే మట్టివాసన.. అబ్బ! ఎంత పరిమళభరితంగా ఉంటుందో కదూ.. జల్లులు పడంగానే ఆ సువాసన ఎందుకు వస్తుంది? అంటే అందుకు చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రసాయనిక చర్య. ఆ సువాసన విడుదలలో బాక్టీరియా, మొక్కలతో పాటు ఉరుములు, మెరుపుల పాత్ర కూడా ఉంది. ఆంగ్లంలో ‘పెట్రికో’ అని పిలిచే ఈ సువాసన రహస్యాన్ని కనుక్కునేందుకు శాస్తవ్రేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పెట్రోస్ అంటే గ్రీకు భాషలో రాయి అని అర్థం. ఇకోర్ అంటే దేవుడి నరాల్లో ప్రసరించే ద్రవం అని అర్థం. 1964లో జర్నల్ నేచర్ అనే పత్రికలో ‘నేచర్ ఆఫ్ అగ్రిల్లేసియస్ ఆడర్’ పేరుతో శాస్తవ్రేత్తలు ఇసాబెల్, రిచర్డ్ థామస్‌లు ప్రచురించిన కథనంలో ‘పెట్రికో’ అనే పదాన్ని ప్రస్తావించారు.
బాగా ఎండిన నేలలు వర్షపు చినుకులు పడగానే తడవడం వల్ల.. ఆ మట్టిలోని స్ట్రెప్టోమైసెస్ బాక్టీరియా ‘జియోస్మిన్’ అనే రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. దానివల్లే తొలకరి వానలకు అంత మంచి సువాసన వస్తుందని ఇంగ్లండులోని జాన్ ఇనె్నస్ సెంటర్‌లోని మాలిక్యులర్ మైక్రోబయాలజీ విభాగం ఇన్‌ఛార్జ్ ప్రొఫెసర్ మార్క్ బట్నర్ వివరిస్తున్నాడు. స్ట్రెప్టోమైసెస్ బాక్టీరియాను అనేక మందుల్లో.. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ మందుల్లో ఎక్కువగా వాడతారు. ఈ బాక్టీరియా స్వచ్ఛమైన మట్టిలో ఎక్కువగా ఉంటుంది.
మే, జూన్ మాసాల్లో తొలకరి జల్లులు పడినప్పుడు వెలువడే జియోస్మిన్‌ను సేకరించి ‘మట్టీ కా అత్తర్’ పేరుతో ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్ ప్రాంతంలో అత్తర్లను తయారుచేస్తున్నారు. ఈ జియోస్మిన్ వాసనను జంతువులకంటే మనుషులే ఎక్కువగా పసిగట్టగలరని ప్రొఫెసర్ బట్నర్ వివరించారు.
మొక్కల్లో సువాసన ఇచ్చే ‘టాపీన్’ అనే కర్బన సమ్మేళనాలు జియోస్మిన్‌ను పోలి ఉంటాయని ప్రొఫెసర్ నీల్సన్ చెప్పాడు. మొక్కల ఆకులకు ఉండే కేశాలలో టాపీన్లు ఉత్పత్తి అవుతాయి. అయితే వర్షం పడినప్పుడు ఆ కేశాలు దెబ్బతిని టాపీన్లు బయటకు వచ్చే అవకాశం ఉందట. అలాగే వాతావరణం మరీ పొడిగా ఉన్నప్పుడు మొక్కల్లో జీవక్రియ నెమ్మదిస్తుంది. ఆ తర్వాత తొలికరి వానలు కురియగానే ఆ మొక్కల నుంచి సువాసన వెలువడుతుంది. ఎండిన కట్టెలు వానకు తడిసినప్పుడు కూడా జియోస్మిన్ వంటి సువాసననిచ్చే రసాయనాలు విడుదలవుతాయని కూడా స్టీవెన్సన్ తెలిపారు. అలాగే ఉరుములతో కూడిన గాలివానల వల్ల కూడా అలాంటి వాసనే వెలువడుతుందని, ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు పెద్ద ఎత్తున మెరుపులు, పిడుగులు పడుతున్నప్పుడు ఓజోన్ వాయువు వాసన వస్తుందని చెబుతున్నారు శాస్తవ్రేత్తలు.
ఏదిఏమైనా వర్షం పడగానే వచ్చే పరిమళం మట్టిలోని బాక్టీరియా వల్ల వచ్చేదే అయినా అది ప్రకృతికి, మానవాళికి హాని చేయకపోగా వాతావరణాన్ని మరింత ఆహ్లాదపరుస్తుంది. కాబట్టి వర్షం పడగానే వచ్చే మట్టివాసనని ఇకముందు మరికొంచెం ఎక్కువగా ఆస్వాదిస్తాం.