Others

బాలీవుడ్‌పై మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్క్‌బ్యూటీ తమన్నా దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది హీరోయిన్లు ముందు గ్లామర్ పాత్రల్లో మెరిసి అటు తర్వాత నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించి క్రేజ్‌ని సొంతం చేసుకుంటారు. అయితే ఈ బ్యూటీకి ఆదిలోనూ కోలీవుడ్‌లో కల్లూరి, టాలీవుడ్‌లో శ్రీ, హ్యాపీడేస్ చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలే లభించాయి. ఆ తరువాత ఈ అమ్మడు చాలా సినిమాల్లో తన గ్లామర్‌తో రెచ్చిపోయి అందాల ఆరబోతతో యువతరం ప్రేక్షకులను విశేషంగా అలరించి, ఆకట్టుకుంది. ఈ బ్యూటీ కెరీర్‌లోనే ‘బాహుబలి’ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోయింది. అందులో అవంతిక పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి. అయితే ఈ చిత్రం తెచ్చిన ఇమేజ్ అంతా, ఇంతా కాదు. దాంతో తమన్నా బాలీవుడ్‌పై భలే మోజు పెంచుకుంది. అక్కడ ఎన్నో చిత్రాల్లో నటించి తన సత్తా చాటాలనుకుంది. ప్చ్..ఏం లాభం? అవకాశాల కోసం ఎంత ఆరాటపడ్డా, ఆ ఆరాటం కాస్త నీరుగారిపోయింది. బాలీవుడ్ అవకాశాల కోసం ఎంతగానో ఎదురుచూసింది. మరెంతగానో ప్రయత్నించింది. కానీ లక్కే కలిసి రాలేదు. నిరాశతో వెనుతిరిగింది. నటిగా దశాబ్దపు మైలురాయిని అధిగమించిన తమన్నా తన సినీ జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కొంది. టాలీవుడ్ ప్రోత్సహించినంతగా మరే వుడ్డూ దరిచేరనీయలేదు. ఈ విషయం గురించి తమన్నాను కదిలిస్తే- ‘‘అలా అని ఎందుకు అనుకుంటున్నారు? నాకు లభించిన అవకాశాలు చాలు. వాటిద్వారా నేనేమిటో నిరూపించుకున్నాను. కోలీవుడ్, టాలీవుడ్ నాకు రెండు కళ్లులాంటివి. ఈ రెండు చోట్లా నేను అందరి అభిమానాన్ని పొందగలిగాను. పరిశ్రమల్లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ మంచి పాపులారిటీ లభించింది. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి? చెప్పండి? సహజంగా ఇంటగెలిచి రచ్చ గెలవాలనుకుంటారు. నేను అలానే టాలీవుడ్, కోలీవుడ్ ద్వారా ఇంట గెలిచాను. బాలీవుడ్‌లోనూ సత్తాచాటి రచ్చ గెలవాలనుకుంటున్నా. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా అక్కడ నేనేమిటో తప్పకుండా నిరూపించుకునే అవకాశం లభిస్తుందన్న గట్టి నమ్మకం నాలో ఇంకా బతికేవుంది. సినిమా పాఠశాల లాంటిది. నిత్యం పలు విషయాలను నేర్పుతుంది. నేను పాఠశాల చదువు పూర్తి కాకుండానే సినీరంగప్రవేశం చేశాను. అందువల్ల కళాశాల్లో చదువుకోలేదన్నదిలోటే. అయితే సినిమాలో ఆ అనుభవాలను నేను చవిచూశాను. పాఠాలు చదవడం, పరీక్షలకు సిద్ధం కావడం, రిజల్ట్ కోసం అతృతగా ఎదురుచూడడం వంటి అనుభవాలను సినిమా ద్వారా పొందాను. తెలుగు చిత్రసీమ ప్రోత్సాహం మరపురానిది. గ్లామర్ పాత్రలే కాదు, నటనకు అవకాశం వున్న పాత్రలు ఎన్నో లభించాయి. వాటిలో నాకు నచ్చినవి, వయస్సు తగ్గవి చేసుకుంటూనే.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకున్నాను. అలాంటి పాత్రలతో దర్శక నిర్మాతలు నన్ను ఎంతగానో తమ చిత్రాల్లో అవకాశాలను కల్పించి కెరీర్‌లో దూసుకుపోయేలా చేశారు. ఫలితంగా ఎన్నో అవార్డులు..రివార్డులు దక్కాయి. ముఖ్యంగా ‘బాహుబలి’లో చేసిన అవంతిక పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర ద్వారా టాలీవుడ్డేకాదు, ప్రపంచ వ్యాప్తంగా నాకు విశేషమైన ఆదరణ లభించింది. నేను ఎక్కడికెళ్లినా అవంతిక పాత్రలో నేను కనబరిచిన నటనకు జేజేలు పలికారు. ఓ నటిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ అది. చాలా మంది అడుగుతుంటారు మీరెక్కువగా గ్లామర్ పాత్రలే చేశారెందుకు? అని. ఏ నటికైనా తొలినాళ్లలో అలాంటి పాత్రలే వస్తాయి. ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయసులో చేయాలి. వయసుదాటాక గ్లామర్ పాత్రలు చేస్తే చూసేవాళ్లుంటారా? అందుకే నేను అలాంటి దారిలోనే నడిచాను. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే. చేయబోయే వైవిధ్యమైన పాత్రలపైనే వుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తూ బిజీగా షూటింగుల్లో పాల్గొంటుంది. ఇది చారిత్రక కథాచిత్రం. అందుకోసం పలు చరిత్ర కథలను చదివి నాటి సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుందట. ‘బాహుబలి’ చిత్రం కోసం కత్తియుద్ధం, గుర్రపుస్వారీ నేర్చుకుంది. మరో చిత్రం కోసం నాట్యంలో శిక్షణ పొందింది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంగా కనే్న కలైమానే చిత్రంలో నటిస్తోంది. ఇవి కాక మరో నాలుగు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ.. ఈ బ్యూటీకి బాలీవుడ్‌పై మోజు మాత్రం తగ్గడం లేదట. ఎప్పటికైనా తన గోల్ అదే అని కూడా చెబుతోంది. చూద్దాం..

-దిల్