Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సంవత్సరమూ మఖాది నక్షత్రాలు భాద్రపదంనుంచి ఫాల్గుణం దాకా, కనిపించకుండా పోతూనే వుంటాయి.
మరి పాండవులు కూడా ప్రతి సంవత్సరమూ అలాగే అయిపోతూ వుంటారా? కాదు ఈ నక్షత్రాలతోపాటు ఇతర అనేక ఖగోళ ప్రభావాలు కలిసినప్పుడే ఈ నక్షత్రాల ప్రభావం కార్యకారి అవుతుంది. కానీ, ఇతర ప్రభావాలు ఎన్నివున్నా, ఈ నక్షత్రాలు కలసివస్తేనే, ఆ సంఘటన మానవ లోకానికి దిగివస్తుంది. అందుకే ఈ సంఘటన జరిగినప్పుడు, అది ఆ నక్షత్రాలకు అనుకూలంగానే జరుగుతుంది.
దీనిని గుర్తించాడు గనుకనే నన్నయభట్టు ఆ కాలం ఆరునెలలని నిర్ణయించి చెప్పాడు.
ఈ సంఘటన తరువాత మహాభారతంలో బకాసుర సంహార ఘట్టం వుంది. బకాసురుణ్ణి సంహరించినవాడు భీముడు.
ఆకాశంలో, దక్షిణ భాగంలో, బకాకారం అయిన నక్షత్ర సమూహం ఒకటి వుంటుంది. దీని ప్రసక్తి వ్యాస భారతంలోనూ, నన్నయ భారతంలోనూ కూడా వుంది. ఈ నక్షత్రాల గుంపును పాశ్చాత్య వైజ్ఞానికులలో బేయర్ అనే ఆయన 17వ శతాబ్దంలో కనిపెట్టాడు.
స్వాతి, బక నక్షత్రములు, ఒకదానికొకటి విరోధి, అంటే ఒకటి ఉదయిస్తే మరొకటి అస్తమిస్తుంది. స్వాతి ఫాల్గుణాంతానికి ఉదయిస్తే, ఆ ప్రాంతానికీ బక నక్షత్రపుంజం అస్తమిస్తుంది. బక నయత్ర ప్రభావంవల్ల జన్మించిన రాక్షసుడి పేరు కూడా బకుడే! వాడి మరణం కూడా బకనక్షత్రం అస్తమించే రోజుల్లో ఏదో ఒక రోజునే జరుగుతుంది. అది సృష్టిలోని ప్రతిబింబ స్వభావ రహస్యం. వ్యాసభగవానుడు ఈ సంఘటననూ, ఆ సంఘటననూ, రెండింటినీ కలిపి చూపిస్తాడు మనకు.
భీమ - బక - దుర్యోధన - కీచ- జరాసంధుల మరణాల విషయం కూడా ఇలాంటి ఘట్టమే. అలాగే, భీముడు దుశ్శాసనుడి గుండెలు చీల్చ, ఆ న ఎత్తురును ద్రౌపది కేశపాశానికి రాయటం కూడా ఒకానొక ఖగోళ సంఘటనకు ప్రతిబింబమే!
వీటి పూర్తి వివరాలు గొబ్బూరి వెంకటానంద రాఘవరావుగారి ‘నన్నయ విజ్ఞాన నిరతి’ వంటి గ్రంథాలలో వున్నాయి. ఇంకా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. ఎన్ని చెప్పినా మనం గ్రహించవలసిన రహస్యం ఏమిటంటే, అంతరార్థాలూ సత్యాలే- జరిగిన సంఘటనలూ సత్యాలే! రెండూ ఒకదానికొకటి ప్రతిబింబప్రాయాలే. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఈనాటి దుర్విమర్శలు చాలామటుకు తగ్గిపోతాయి.
వినాయకుడు
గజాననం భూత గణాధి సేవితం
కపిత్థ జంబూ ఫలసారభక్షణమ్
ఉమాసుతం శోక వినాశకారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్
గణపతి! వినాయకుడు! విఘ్నేశ్వరుడు! ఇలాంటి పర్లు వినేవారికి కాశ్మీరు నుంచి కన్యాకుమారిదాకా ఏ మనిషికీ కొత్త అనిపించదు. అతడు ఏ మతంవాడైనా సరే, అతని మనస్సుకు ఈ దేవుణ్ణి గురించి ఎంతో కొంత నాకు తెలుసు అన్న భావమే కలుగుతుంది. అందుకే, భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ, ప్రాక్పశ్చిమాల్లోనూ, సమమైన ఆవేశంతో ప్రజలు సమావేశమై జరుపుకుమనే పెద్ద పండగల్లో వినాయక చవితి మొట్టమొదటిది, అతి పెద్దదీ కూడా!
వినాయక చవితి
ఇంతకూ వినాయకుడికీ, భాద్రపద శుద్ధ చవితికీ సంబంధమేమిటి? ఆ రోజే ఆయనను అంత పెద్దగా పూజించవలసిన అవసరమేమిటి?
ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కొక్క సమాధానం చెపుతున్నారు.
అది ఆయన పుట్టినరోజు, అందువల్ల ఆ రోజు ఆయనకు ముఖ్యం! ఇదొక సమాధానం. ఇది కొంతమంది ప్రజలకు కొంతవరకూ తృప్తినిచ్చింది. కానీ క్రమంగా ప్రజలలో తార్కిక దృష్టి పెరిగినకొద్దీ, ఈ సమాధానం చాలక, వేరే సమాధానాలకోసం అనే్వషణ పెరిగింది.
భాద్రపదశుద్ధం అంటేవర్ష ఋతువుకు మధ్యభాగం. అప్పటికి ఊళ్ళల్లో చెట్లన్నీ బాగా కాచి, పూచి వుంటాయి. రైతులకు పొలాల్లో నాట్లు వగైరా పనులు పూర్తయి, కొంచెం ఖాళీగా వుంటారు. కనుక ఈ సమయంలో ప్రకృతి మనకిచ్చిన మంచి ఓషధీ పత్రాలన్నీ ఒక చోటుకి చేర్చి, తద్వారా గ్రామాల్లో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటుచేసి దాంట్లో ఏకవంశతి పత్ర పూజ (21 రకాల ఆకులతో పూజ) దూర్వాపూజ (గరికతో పూజ) మొదలైనవన్నీ ఏర్పాటుచేశారు! ఇది మరో సమాధానం.
దీంట్లో కొంచెం సైన్సు, కొంచెం సెంటిమెంటు, కలిసిపోయి వున్నాయి. ఇది కొంత తృప్తినిస్తోంది. కానీ కొంత మాత్రమే! ‘జరిగే పూజను చూసి, మీరు మీ మేధాశక్తిని ఉపయోగించి, సమన్వయం చేస్తున్నారేగానీ ఈ పూజ ఇందుకోసమే అని ఎక్కడైనా పాత గ్రంథాల్లో ప్రమాణ వాక్యం వుందా? అనే ప్రశ్న అలాగే మిగిలిపోయి వుంటోంది గదా’’ అని ప్రశ్నిస్తోంది యువ హృదయం.
ఔను, నిజమే! ఈ రోజుల్లో ఈ అపశ్న అలా మిగిలిపోయే వుంటోంది. దానికి కారణమేమంటే, మీరన్నారే ఆ పాత గ్రంథాలు, అంటే, వేదాలు, ఆగమాలు, పురాణాలు, వగైరాల అధ్యయనం ఈనాటి సమాజంలో లోపించి వుంది. అది లోపించటంవల్ల పెద్దవాళ్ళెవరో చెప్పినది విని, నమ్మేసి, చేసుకుపోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ అధ్యయనం సమాజంలో సమృద్ధిగా వున్న రోజుల్లో, అలా కేవల విశ్వాసంమీద ఆధారపడి నడవలసిన అవసరం వుండేది కాదు. కనుక మనం కూడా ఇపుడు ఆ పాత గ్రంథాల్లో ఏముందో స్వయంగా చూడటం నేర్చుకోవాలి.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి