Others

సితార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్భుతః అనిపించి మనసు పులకింపచేసే ఎన్నో సన్నివేశాలున్న దృశ్యప్రేమ కావ్యంగా ‘సితార’ చిత్రాన్ని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. భానుప్రియకు ఇది మొదటి సినిమా అంటే కాదు వందవ చిత్రం అని వాదించొచ్చు. కొత్తదనం అనేది లేకుండా ఎంతో సమర్ధవంతంగా తన పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసింది. అన్ని భాషలలోను కొన్ని వందల, వేల ప్రేమకథా చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. మాది డిఫరెంట్ లవ్‌స్టోరీ అంటూ ఇపుడు వస్తున్న చిత్రాల నిర్మాత, దర్శకులు, హీరోలు చెప్పుకుంటూ తెగ హడావుడి చేస్తూ ఉంటా రు. కానీ సినిమాలో ఎంతకీ ఈ ‘డిఫరెంట్’అనేది సినిమా పూర్తయ్యేవరకూ కనపడదు. కానీ సితార చిత్రంలో మాత్రం ఇది తప్పకుండా కనిపిస్తుంది. అది ఏంటంటే బయటి ప్రపంచం అంటే ఏమిటో తెలియని కథానాయిక ఒక పంజరంలాంటి కోటలో ఉండగా, ఎటువంటి బాధ్యత లేకుండా వీధి నాటకాలు ఆడి పొట్టపోసుకొనే కథానాయకుడి మధ్య ప్రేమ అనేది సృష్టించటం నిజంగా దర్శకుడు చేసిన అద్భుతమే. ఇది నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యంగా నిజంగా ప్రేమకథ అంటే ఇలా ఉండాలి అనిపించేలా సినిమా మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్వంద్వార్థాలు, హోరెత్తించే సంగీతం లేకుండా సినిమాలో లీనమై చూసేలా చేసే ఈ చిత్రం తెలుగులో కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో ఈ చిత్రాన్ని ముందువరుసలో ఉండేలా చేస్తుంది. సి.డిల పుణ్యమా అని ఈ చిత్రాన్ని ఎన్నిసార్లుఅయినా ఆస్వాదించవచ్చు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతమైన మంచి పెయింటింగ్‌లా మనకు కనిపిస్తుంది. ‘కుకుకూ... కోకిల రావే’ పాట అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ పాటలో జూనియర్ ఆర్టిస్టుల కళ్ళు, చేతులు మాత్రమే కనిపిస్తూ దర్శకుడి ప్రతిభను తెలియచెబుతుంది. కథానాయకుడు సుమన్ పంజరాల్లోని పక్షులను, చిలకలను వదిలివేస్తాడు. భానుప్రియ వాటిని వదలొద్దు అని చెబితే మళ్ళీ ఇద్దరూ వాటిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ అనుకోకుండా ఒకరినొకరు కౌగిలించుకొని ప్రేమలోపడటం అప్పుడు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేమికులను మరో లోకంలోకి తీసుకుపోతుంది. ఈ చిత్రానికి ప్రధాన కాథానాయకుడిగా ఇళయరాజాను చెప్పుకోవచ్చు. ఇళయరాజా లేకపోతే ఈ చిత్రం లేదు అనిపించి మరొక సంగీత దర్శకుడ్ని ఊహించుకో లేనంతగా రాజా తన సంగీతాన్ని అందించారు. జాతీయస్థాయి అవార్డును కూడా ఈ చిత్రం సొంతం చేసుకుంది. దర్శకుడు వంశీ ప్రతి సన్నివేశాన్ని చూపు మరల్చుకోలేనంతగా చిత్రీకరించగా, శరత్‌బాబు, సోమయాజులు తమ పాత్రల్ని బాగా రక్తికట్టించారు. గోదావరి అందాలు, రాజుగారి కోట, రామచిలుకలు, కోకిలలు, సంగీత వాయిద్యాలు మన మనసుల్ని సుతిమెత్తగా మంద్రస్థాయిలో ‘సితార’లా మీటుతూ ఎంతో ఆహ్లాదపరుస్తాయి.
-జె.రాధాకృష్ణ ఉమాశంకర్, నర్సాపురం, ప.గో.జిల్లా