Others

‘నభో లోకనాయకా...’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముక్కామలగా అందరికీ తెలిసిన నటుడి పూర్తిపేరు ముక్కామల కృష్ణమూర్తి. ‘పాతాళభైరవి’లో మాంత్రికుడిగా ముందు యితడిని అనుకుని, కారణాంతరాలవల్ల రంగారావుచే వేయించారని వినికిడి.
ఈ ముక్కామల దర్శకత్వంలో గీతాపిక్చర్స్ అనే సంస్థ 1961లో ‘రుష్యశృంగ’అనే చిత్రం నిర్మించింది. దీనికి నిర్మాత పి.ఎస్.శేషాచలం, సంగీత దర్శకుడు టి.వి.రాజు. ఇందులో హరనాథ్, గుమ్మడి, రేలంగి, రాజసులోచన వగైరా నటించారు. తమిళంలోకూడా యిదే పేరుతో తయారవగా హరనాథ్ పాత్రను బాలాజీ పోషించారు.
విభాండకుడు అనే మహర్షి తన కుమారుడు రుష్యశృంగుడిని జన వాసాలకు దూరంగా అడవులలో పెంచుతాడు. రుష్యశృంగుడికి స్ర్తిలు అనే వారుంటారని కూడా తెలియదు. ఒకప్పుడు అంగరాజ్యంలో తీవ్రక్షామం ఏర్పడుతుంది. ఆ రాజ్యాన్ని పాలించే రోమపాదుడు పండితులు, జ్ఞానులూ సూచించినమేరకు రుష్యశృంగుడిని తన రాజ్యానికి రప్పిస్తే వర్షాలు కురుస్తాయని నమ్మి, ఒక నర్తకిని పురమాయిస్తాడు, ఆమె తన ఆటపాటలతో, అంద చందాలతో రుష్యశృంగుడిని ఆకర్షించి, అంగరాజ్యానికి తీసుకువస్తుంది. కరువుతో ప్రజలు పడ్తున్న బాధలు చూసిన రుష్యశృంగుడు చలించిపోయి పరమాత్మను ప్రార్థిస్తూ ‘‘నభో లోకనాయకా’’అంటూ ఎలుగెత్తి ప్రార్థిస్తాడు.
ఈ పాట ఆద్యంతం పైస్థాయిలో వుండి, మధ్యమధ్య ఉరుముల, మెరుపుల ధ్వనితో చాలా ఉత్తేజభరితంగా వుంటుంది. ఘంటసాల ఎంతో ఆర్తితో, ఆవేదనతో, ఉద్వేగంతో తారస్థాయిలో పాడిన ఈ పాట నాకు చాలా యిష్టం. తమిళ సినిమాలో ఈ పాట ఎందుకనో వేరే గాయకుడు పాడారు. మిగతా పాటలన్నీ తమిళంలో కూడా ఘంటసాలే పాడారు. ఆ తరువాత రుష్యశృంగుడికి తన కుమార్తె శాంతను యిచ్చి రామపాదుడు వివాహం జరిపిస్తాడు. ఈ శాంత అన్న ఆవిడే రామాయణంలో రాముడి సోదరిగా చెప్పబడింది.

- డి.ఎస్.శంకర్, వక్కలంక