Others

నాకు నచ్చిన పాట--మహేశా.. పాప వినాశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహేశా పాప వినాశా కైలాసవాసా ఈశా..’ ఈ పాట ‘కాళహస్తి మహత్మ్యం’ చిత్రంలోనిది. దశాబ్దాలు దాటినా భక్త్భివాన్ని, హృదయ స్పందన కలిగించే భక్తులకు మరువరాని పాట ఇది. పామరుడు కానీ, పండితుడు కానీ భక్త్భివనతో తెల్పుకునే విన్నపాలు భోళాశంకరుడు వింటాడని, కరుణించి ఆదుకుంటాడన్న నమ్మకము కలిగించే చిత్రమిది. ‘్భక్తియేదో, పూజలేవో తెలియనైతినే, పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా’ అంటూ అమాయకత్వం, ‘మంత్రాలు తంత్రాలు ఎరుగను/ నాదమేదో తెలియనైతినే, వాదమేల పేద బాధ తల్చరావయా స్వామి బాధ తలచి వేగరావయ స్వామి’ అని కన్నీటి పర్యంతమైన రక్తకన్నప్ప దృశ్యం భక్తులకంట చెమ్మ తెప్పిస్తుంది. -చివరగా ఏకచిత్తమున నిన్ను నమ్మిన వారికి శోకము బాధలు తీర్చి ఆకలి తీర్చరావయస్వామి... అంటూ క్షుద్భాధతో ఒంటరిగా అడవిలో చిక్కి దిక్కుతోచని పరిస్థితిలో పరమేశ్వరుని ప్రార్థించిన దృశ్యం ప్రతి ప్రేక్షకునికి ఆకలిబాధలోని ఆర్ధ్రతను అందించినట్టుయ్యింది. కన్నడ నటుడు రాజ్‌కుమార్ ఈ పాటకు అద్భుత హావభావాలు చూపించాడు. ఆయన నటించిన చిత్రాల్లోకెల్లా మేటి చిత్రమిది.
రచయిత తోలేటి వెంకటరెడ్డి ఓ నిజమైన భక్తుడి యొక్క జీవ రక్షణ ఆవేదన, భక్త్భివము, ప్రతి ఒక్కరికీ హృదయ స్పందన కలిగించలా కథను మలిచాడు. అదే స్థాయలో అద్భుత సన్నివేశాలతో హెచ్‌ఎల్‌ఎన్ సింహా సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రానికి సంగీతం అందించిన ఆర్ గోవర్థనమ్, ఆర్ సుదర్శనం సంగీతం సుమధురం శ్రవణానందం. రుచికరం, పావనం ఘంటసాల గాత్రం. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.
***

వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

* ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
*రచనల్లో కొత్తదనం ముఖ్యం
*అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
*కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
*తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
*కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
*ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
*రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
*ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-జె ప్రసాదరావు, ఖమ్మం