Others

రుణమాఫీ పథకంతో రైతుకు మేలెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేపలు ఇవ్వడం కాదు, వాటిని పట్టడం నేర్పించాలి’ అని ఇంగ్లీష్‌లో ఓ సూక్తి వుంది. ఇలా ఉచితంగా ఇచ్చేవాడుంటే.. మంచంపై ఉన్న రోగి కూడా లేచి కూర్చుంటాడని అంటుంటారు. నిజమే.. ఈ మాటల వెనుక ఎంతో నిగూఢార్థం వుంది. ఈమధ్య మన పాలకులకు ‘రైతు సంక్షేమం.. అన్నదాతకు భరోసా’ అనే సెంటిమెంట్ పదాలు మాట్లాడటం పరిపాటిగా మారింది. నిన్నగాక మొన్న కర్నాటకలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కుమారస్వామి కూడా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రైతులకు రుణమాఫీ ఫైల్‌మీద సంతకం పెట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు ‘చంద్రులు’ 2014 ఎన్నికల సమయంలో ఇదే విషయాన్ని తమ తమ మ్యానిఫెస్టోల్లో పెట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ పథకాన్ని అతికష్టం మీద అమలుచేశారు.
ఇపుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నింటినీ తప్పకుండా మాఫీ చేస్తామని ఘనమైన వాగ్దానం ఇస్తున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా రుణమాఫీని అమలు చేస్తామంటున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అయితే.. నాలుకకు నరం లేనివిధంగా రోజుకో హామీ ఇస్తున్నాడు. ఏవేవో మాఫీ చేస్తానంటున్నాడు. ఏడాది కిందట ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా రైతులకు రుణమాఫీపై హామీ ఇచ్చింది. ఇటువంటి హామీలతో అక్కడ బిజెపి అత్యధిక మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. 2009 ఎన్నికలకు ముందు అప్పటి యూపీఏ ప్రభుత్వ పాలకులు రైతులకు రుణమాఫీ హామీ మేరకు రైతుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా రూ.5వేల నుంచి రూ.10వేల వరకు డిపాజిట్ చేశారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించారు. ఆ హామీతో చాలామంది రైతులకు జాతీయ బ్యాంకుల్లో చేసిన అప్పులతోపాటు ససకార బ్యాంకుల్లో ఉన్న రుణాలు సైతం మాఫీ అయ్యాయి.
1989 ఎన్నికలకు ముందు నేషనల్ ఫ్రంట్ తరఫున ప్రధాని అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ కూడా ప్రతి రైతుకు రూ.10వేల వరకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అతను ప్రధానిగా కొనసాగిన ఏడాది కాలంలో దాన్ని అమలు చేశారు. రాజకీయ నాయకులు ఇలా రుణమాఫీ గురించి హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన తరువాత మాఫీ చేస్తుంటే రైతులలో జవాబుదారీతనం లోపిస్తున్నది. రైతుల్లో ఆశలు నింపుతున్న ఇలాంటి హామీలకు చరమగీతం పాడాలి. రుణమాఫీ ఇస్తారని రైతులు కూడా బ్యాంకులకు వాయిదాలు చెల్లించడం మానేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల్లో రైతుల రుణాలను మాఫీ చేయడం వల్ల బ్యాంకులపై అనూహ్యంగా ఆర్థిక భారం పడుతోంది.
వ్యవసాయోత్పత్తులను రైతులు భారీగా పెంచేలా ప్రోత్సాహకాలు అందించాలి. ఆత్మగౌరవంతో వారు జీవించేలా ఆసరా ఇవ్వాలే తప్ప ఉచిత పథకాలు, రుణమాఫీలు వంటివి అలవాటు చేయరాదు. ఇటీవల అమలు చేస్తున్న రుణమాఫీ పథకాల ద్వారా రైతులకు తాత్కాలిక ప్రయోజనాలు తప్పితే పెద్దగా ఒరిగిందేమీ లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తేల్చి చెప్పింది. ప్రభుత్వాలపై ఏయేటికాయేడు ఆర్థిక భారం పెరుగుతున్నదని, ఇది భవిష్యత్తులో పెను ఆర్థిక సంక్షోభానికి దారితీయనున్నదని ఆ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. 2008 నుంచి అమలుచేస్తూ వస్తున్న రుణమాఫీలను చూస్తే రైతు కుటుంబాల ఆర్థిక భారం తగ్గినప్పటికీ పెట్టుబడులు, కుటుంబాల ఆదాయం పెరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని రిజర్వ్ బ్యాంక్ పెదవి విరిచింది.
వరుస కరవులతో పాటు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్న కారణంగా రుణమాఫీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ మాఫీ ప్రభావం ఒక్కో రాష్ట్రంపై ఒక్కో విధంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో చేసిన రుణమాఫీ మొత్తం స్థూల ఆర్థిక లోటులో దాదాపు 60.9 శాతానికి సమానం. 2017-18లో వివిధ రాష్ట్రాలు చేసిన రుణమాఫీలు అవి ప్రకటించినదానికంటే తక్కువగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అమలుచేస్తే ఆర్థిక పరిస్థితులు మరింత కుచించుకుపోవడం ఖాయం. ఈ పథకాల కారణంగా 2017-18లో వివిధ రాష్ట్రాల మూలధన వ్యయం తగ్గిపోయింది. ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలపై చేసే ఖర్చు తగ్గిపోయింది. ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలను దారితప్పేలా చేస్తున్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సహాయ సంస్థలు రైతులకు రుణాలు ఇవ్వడానికి సుముఖత చూపించడం లేదు. ఇందువల్ల భవిష్యత్తులో గ్రామీణ రుణ వ్యవస్థ అగాథంలో పడే ప్రమాదం పొంచి వుంది. రుణమాఫీ వల్ల అసలైన రైతులకంటే ఇతరులే ఎక్కువ లబ్ధి పొందుతున్నారని కూడా రిజర్వు బ్యాంకు నిగ్గుతేల్చింది.
-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212